S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/01/2016 - 06:59

హైదరాబాద్, మే 31: విదేశాల్లో విద్యను అభ్యసించే ఎస్సీ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని పెంచింది. అంబేద్కర్ ఓవర్సిస్ ఎడ్యుకేషన్ పథకం కింద ఇప్పటి వరకు ఒక్కో విద్యార్థికి పది లక్షల రూపాయల సహాయం అందించే వారు. దానిని రెట్టింపు చేశారు. 20లక్షల రూపాయల సహాయం అందిస్తారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు మంగళవారం సంతకం చేశారు.

06/01/2016 - 06:58

హైదరాబాద్, మే 31: సికింద్రాబాద్‌లోని ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైనె్సస్ (ఎసిడిఎస్)కు యుజిసి ఆధీనంలోని ది నేషనల్ అసెస్‌మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (నేక్) ‘ఏ’ గ్రేడ్‌ను ప్రకటించింది. నేక్ సంస్థ ప్రతినిధులు తొలిసారి ఆర్మీ కాలేజీ ఆఫ్ డెంటల్ సైనె్సస్‌ను సందర్శించారు. ముగ్గురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి నిపుణుల బృందం సంస్థను సందర్శించిందని అధికారులు చెప్పారు.

06/01/2016 - 06:58

హైదరాబాద్, మే 31: తెలంగాణ ఎంబిఎ, ఎంసిఎ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ -2016 ఫలితాలను కాకతీయ విశ్వవిద్యాలయం ఇన్ చార్జి వైస్ చాన్సలర్ టి చిరంజీవులు మంగళవారం సాయంత్రం విడుదల చేశారు. ఐసెట్ కన్వీనర్ కె ఓం ప్రకాష్, ఉన్నత విద్యామండలి అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మే 19న నిర్వహించిన ఐసెట్ ఫలితాలను రికార్డు సమయంలో విడుదల చేసినట్టు చిరంజీవులు చెప్పారు.

06/01/2016 - 06:57

హైదరాబాద్, మే 31 : తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి తల్లీబిడ్డలను ఆసుపత్రుల నుండి ఇళ్లకు పంపించేందుకు ‘అమ్మఒడి’ పేరుతో ఒకరకమైన వాహనం, పేదలు ఎవరైనా ఆసుపత్రుల్లో మరణిస్తే ఆ శవాలను వారి వారి ఇళ్లకు తరలించేందుకు ‘ఫ్రీ హార్సే సర్వీస్’ పేరుతో మరోరకమైన వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.

06/01/2016 - 05:19

కరీంనగర్, మే 31: పెద్ద హనుమాన్ జయంత్యుత్సవాల సందర్భంగా మంగళవారం కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు భక్తజన సంద్రంతో పులకించిపోయింది. ఆంజనేయస్వామికి ప్రీతికరమైన రోజున హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగడంతో అంజన్న సన్నిధి భక్తజనంతో కిక్కిరిసిపోయింది.

05/31/2016 - 18:07

హైదరాబాద్: తిరుపతి మహానాడులో తమ పార్టీ చేసిన తీర్మానాలపై తెరాస అధినేత, సిఎం కెసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు టి.టిడిపి నేత రేవూరి ప్రకాష్‌రెడ్డి విమర్శించారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల రీ-డిజైనింగ్ ఫలితంగా రెండు తెలుగు రాష్ట్రాలకూ భవిష్యత్‌లో నష్టం జరుగుతుందన్నారు.

05/31/2016 - 18:07

హైదరాబాద్: నగరంలో మంగళవారం కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షం కురియగా, మరికొన్ని చోట్ల వేసవి తాపాన్ని కలిగించేలా ఎండ కొనసాగింది. పంజాగుట్ట, ఫిల్మ్‌నగర్, అమీర్‌పేట తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.

05/31/2016 - 18:06

హైదరాబాద్: తెలంగాణలో అధికార తెరాస పార్టీతో కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నట్లు రాజ్యసభ ఎన్నికలే నిదర్శనమని టి.టిడిపి నేత రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేయకపోవడం పెద్ద తప్పు అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పోటీ చేసి ఉంటే ఇటీవల తెరాసలోకి ఫిరాయించిన ఆ పార్టీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడి ఉండేదన్నారు.

05/31/2016 - 17:47

హైదరాబాద్‌: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరం ప్రవేశాల కోసం కాకతీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన టీఎస్‌ ఐసెట్‌-2016 ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి.
మొదటి ర్యాంక్‌-గాజుల వరుణ్‌(154 మార్కులు)
రెండో ర్యాంక్‌- వివేక్‌ విశ్వనాథన్‌ అయ్యర్‌(154)
మూడో ర్యాంక్‌- రాంప్రసాద్‌(153)

05/31/2016 - 15:58

హైదరాబాద్: గత రెండేళ్ల కాలంలో తెలంగాణలో శాంతి భద్రతలు సజావుగానే ఉన్నాయని డిజిపి అనురాగ్ శర్మ మంగళవారం తెలిపారు. హైదరాబాద్‌తో పాటు తెలంగాణ జిల్లాల్లో మహిళల పట్ల వేధింపులు తగ్గాయని, రోడ్డు ప్రమాదాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టిందన్నారు. ఆగస్టులో జరిగే కృష్ణా పుష్కరాలకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు.

Pages