S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/18/2016 - 16:24

వరంగల్: వరంగల్ జిల్లాలో ఎంతో ప్రాధాన్యత కలిగిన మానుకోట (మహబూబాబాద్)ను జిల్లాగా ప్రకటించాలని కాంగ్రెస్ కార్యకర్తలు బుధవారం ఆందోళన చేశారు. మానుకోట తహశీల్దార్ ఆఫీసుపై వారు నల్లజెండాలు ఎగురవేశారు. కొత్త జిల్లాల ఏర్పాటులో మానుకోటను సిఎం కెసిఆర్ గమనించకపోవడం తగదన్నారు. జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు.

05/18/2016 - 16:20

హైదరాబాద్: దళారులను, అవినీతిని అడ్డుకునేందుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఐటి, పురపాలక మంత్రి కెటిఆర్ తెలిపారు. ఆయన బుధవారం హెచ్‌ఎండిఎలో ఆన్‌లైన్ సేవలను ప్రారంభించారు. లే అవుట్, భవన నిర్మాణం, భూ బదలాయింపులకు అనుమతులను ఇక ఆన్‌లైన్‌లో అందజేస్తామన్నారు. పాలనలో పారదర్శకత కోసం టెక్నాలజీని వినియోగిస్తున్నామన్నారు.

05/18/2016 - 16:20

హైదరాబాద్: రాజోలిబండ ఎత్తిపోతల పథకం (ఆర్డీఎస్) పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ సర్కారు బుధవారం నాడు కృష్ణా రివర్ బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఆర్డీఎస్ ఆధునీకరణ పనులు పూర్తి చేసేందుకు కర్నాటక ప్రభుత్వం సుముఖంగా ఉందని, ఎపికి అభ్యంతరాలు ఎందుకని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

05/18/2016 - 16:19

హైదరాబాద్: టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించాల్సిన డిఎస్సీ ఇక తెలంగాణలో లేనట్టే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై తెలంగాణ సర్వీస్ కమిషన్ ద్వారా టీచర్ పోస్టులకు నియామకాలు జరుగుతాయని ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీంతో డిఎస్సీ జరుగుతుందని ఇన్నాళ్లూ ఎదురుచూసిన నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్టయ్యింది. టీచర్ పోస్టుల భర్తీలో మరింత ఆలస్యం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.

05/18/2016 - 13:53

వరంగల్: ఉప్పల సూరి అనే ఖైదీ పరారైన సమయంలో విధినిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న కారణంతో ఏఆర్ హెడ్‌కానిస్టేబుళ్లు ఇ. లింగారెడ్డి, ఎన్. మల్లారెడ్డి, డి. అంజయ్య లను సస్పెండ్ చేస్తూ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నాంపల్లి కోర్టులో హాజరుపరిచి వరంగల్‌కు సూరిని తీసుకెళ్తుండగా, యశ్వంతాపూర్ సమీపంలో పరారైన విషయం తెలిసిందే.

05/18/2016 - 13:48

హైదరాబాద్: విమానంలో ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయవాడ టిడిపి కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావుకు శంషాబాద్ పోలీసులు నోటీసు పంపారు. తాము చేపట్టే విచారణకు వారం రోజుల్లోగా హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.

05/18/2016 - 12:11

ఆదిలాబాద్: విద్యుత్ స్తంభాలను తీసుకువెళుతున్న ఓ ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొని బోల్తాపడడంతో ముగ్గురు కూలీలు మరణించారు. దండేపల్లి మండలం లింగాపూర్ వద్ద బుధవారం ఈ ఘోరం జరిగింది.

05/18/2016 - 12:10

వరంగల్: కొత్త జిల్లాల ఏర్పాటు కోసం వరంగల్ జిల్లాలో ఆందోళనలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ములుగు జిల్లాను ఏర్పాటు చేయాలని కోరుతూ ఆ ప్రాంతంలో బుధవారం రెండోరోజు కూడా బంద్ పాటిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కోసం ఈరోజు ఆందోళనకారులు రైల్‌రోకో నిర్వహించారు. శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను జెఎసీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది.

05/18/2016 - 07:36

హైదరాబాద్, మే 17 : తెలంగాణ రాష్ట్రాన్ని కరవు పరిస్థితి ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. పంటలు నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ పేరుతో సాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వ గత నెలలోనే 702 కోట్ల రూపాయలు విడుదల చేసింది. అయితే ఇప్పటివరకూ ఈ నిధులు పంట నష్టపోయిన రైతులకు చేరలేదు. ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఇన్‌పుట్ సబ్సిడీ కోసం రైతులు గత ఆరేడు నెలల నుండి ఎదురు చూస్తున్నారు.

05/18/2016 - 07:22

మహబూబాబాద్, మే 17: అధికారుల అండతో.. అధికార పార్టీ నాయకుల భరోసాతో అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన వరంగల్ జిల్లా మానుకోటలో మరో సరికొత్త అవినీతి వ్యవహారం వెలుగుచూసింది. మానుకోట పట్టణంలోని ఓ రైస్‌మిల్లు కేంద్రంగా తప్పుడు వేబిల్‌లు సృష్టించి పేదలకు అందాల్సిన బియ్యాన్ని యధేచ్ఛగా మానుకోట నుండి కాకినాడకు తరలిస్తున్న బడా అక్రమ వ్యాపారం విజిలెన్సు అధికారుల తనిఖీలో పట్టుబడింది.

Pages