S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/03/2016 - 07:02

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియా యూనివర్శిటీలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. నవతెలంగాణ విద్యార్థి జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించతలపెట్టిన జనజాతర సభకు అనుమతించొద్దంటూ లా విద్యార్థి రాహుల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

,
06/03/2016 - 07:02

నకిరేకల్, జూన్ 2: నల్లగొండ జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిరేకల్‌కు చెందిన బిటెక్ విద్యార్థిని గూడూరు ఝాన్సీరాణి (21) మృతి మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించారు. కట్టుకున్న భర్త, కన్నతల్లి కలిసి ఆమెను హత్య చేసినట్లు నిర్థారించారు. ఈ హత్య కేసులో ఏడుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపినట్లు నల్లగొండ డిఎస్పీ ఎస్.సుధాకర్ తెలిపారు.

06/03/2016 - 06:57

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో శౌర్యం, ప్రతిభ కనబర్చిన పోలీసులకు వివిధ పతకాలను పరేడు గ్రౌండ్‌లో జరిగిన వేదికపై ముఖ్యమంత్రి అందజేశారు. ముఖ్యమంత్రి శౌర్యపతకం, రాష్ట్ర శౌర్య పతకం, రాష్ట్ర మహోన్నత సేవా పతకం, ముఖ్యమంత్రి సర్వోత్తమ సేవా పతకం వంటి నాలుగు రకాల పతకాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఈ సందర్భంగా బహుకరించారు.

06/03/2016 - 06:57

హైదరాబాద్, జూన్ 2: బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేందుకు కెసిఆర్ కుట్ర పన్నారని టిపిసిసి వర్కింగ్ అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క ధ్వజమెత్తారు. గురువారం ఇక్కడ గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆయన జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి అభినందన దినోత్సవంగా జూన్ 2ను జరుపుతున్నామన్నారు.

06/03/2016 - 06:56

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం శుక్రవారం మధ్యాహ్నం పనె్నండు గంటలకు సచివాలయంలో జరుగుతుంది. కొత్త జిల్లాల ఏర్పాటు గురించి విస్తృతంగా చర్చించనున్నారు. జూన్ రెండున ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లోనే కొత్త జిల్లాల ప్రకటన చేయాలని ముఖ్యమంత్రి తొలుత భావించారు. వివిధ జిల్లాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు కోసం ఆందోళనలు జరుగుతున్నాయి.

06/03/2016 - 06:56

హైదరాబాద్, జూన్ 2: కేరళ విద్యాశాఖలో లెక్చరర్ల పోస్టుల ఎంపికకు నిర్వహించిన పరీక్షలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్థులు ప్రతిభాపాటవాలను ప్రదర్శించారు. ఎకనామిక్స్‌లో ఎంఎ, పిహెచ్‌డి చేసిన అంజు సుశాన్ థామస్ ఎంపిక పరీక్షల్లో టాపర్‌గా నిలిచారు.

06/03/2016 - 06:55

హైదరాబాద్, జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్‌గా హైకోర్టు జడ్జి జస్టిస్ వి. రామసుబ్రమణ్యన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర న్యాయవ్యవహారాల కార్యదర్శి ఎ. సంతోష్‌రెడ్డి పేరుతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2015 మే 23 నుండే ఈ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయని స్పష్టం చేశారు.

06/03/2016 - 06:55

నర్సంపేట, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం వచ్చినా తనకు ఉద్యోగం రాలేదని మనస్తాపంతో డిగ్రీ చదివిన ఓ నిరుద్యోగ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్‌లో గురువారం జరిగింది. మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయ. నర్సంపేట పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఇప్ప సాంబయ్యకు ఇద్దరు కుమారులు.

06/02/2016 - 08:14

కరీంనగర్ టౌన్, జూన్ 1: కరీంనగర్ పట్టణానికి సమీపంలోని దిగువ మానేరు రిజర్వాయర్‌లో విషాదం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం ఈతకు వెళ్ళిన ఇద్దరు విద్యార్థులు నీటిలో మునిగి మరణించారు. వివరాల్లోకి వెళ్తే..నగరంలోని జ్యోతినగర్‌కు చెందిన బీరెల్లి సాయికుమార్ (16), సాదుల సునంద్(16)తో పాటు మరో ఐదుగురు మిత్రులు.

06/02/2016 - 08:13

మానకొండూర్, జూన్ 1: కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం భారీ ఈదురు గాలులతో కురిసిన వర్షంలో పిడుగు పడి చెరువు కట్టపై గల ఓ చెట్టుకింద ఉన్న ఇద్దరు మహిళలు మృతి చెందగా, నలుగురు తీవ్రంగా, మరో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు.

Pages