S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

06/04/2016 - 06:20

హైదరాబాద్, జూన్ 3: నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వారంలో తెరాసలో చేరనున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయ. తొలుత ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి తెరాసలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే కొన్ని కారణాలతో దీనిపై నిర్ణయం జరగలేదు.

06/04/2016 - 06:14

హైదరాబాద్, జూన్ 3: కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల సభలో ప్రసంగించిన టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డితో పాటు మరి కొందరు నాయకులపై, విద్యార్థి సంఘాల నాయకులపై ఉస్మానియా వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు.

06/04/2016 - 06:12

కరీంనగర్, జూన్ 3: గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ ఈదులుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలి తీవ్ర స్థాయిలో వీచడంతో పలుచోట్ల పాత ఇండ్లు, రేకుల షేడ్లు కూలిపోగా, చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

06/04/2016 - 06:11

హైదరాబాద్, జూన్ 3: మహానగరంలో మరోసారి శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. క్యుములోనింబస్ మేఘాలు మరోసారి తమ ప్రతాపం చూపడంతో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, రెడ్‌హిల్స్, హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్, లోయర్ ట్యాంక్‌బండ్‌తో పాటు ఇందిరాపార్కు సహా పలుచోట్ల చెట్లు నేలకొరిగాయ. దీంతో మాదాపూర్, జూబ్లీహిల్స్‌లోని పలు ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది.

06/04/2016 - 06:10

హైదరాబాద్, జూన్ 3: రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని, తెలంగాణ అంటే ఏమిటో దేశానికి అర్థం కావాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, టిడిపి, సిపిఎం పార్టీలకు చెందిన జెడ్‌పిటీసి, ఎంపిటీసిలు, ఎంపిపిలు, కౌన్సిలర్లు ముఖ్యమంత్రి అధికార నివాసంలో శుక్రవారం టిఆర్‌ఎస్‌లో చేరారు.

06/04/2016 - 06:10

హైదరాబాద్, జూన్ 3: తెలంగాణలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పురోగతిపై శనివారం హైదరాబాద్‌లో పార్లమెంటరీ బృందం కీలక సమావేశం జరుగుతుంది. ప్రాజెక్టుల పురోగతిని ఈ బృందం సమీక్షిస్తుంది. పార్లమెంటు సభ్యులు హుకుం సింగ్ అధ్యక్షతన ఏర్పడిన 17 మంది సభ్యుల కమిటీ హైదరాబాద్‌కు రానుంది. మాదాపూర్‌లోని నోవాటెల్‌లో తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో పార్లమెంటు సభ్యుల బృందం వివిధ అంశాలపై చర్చిస్తుంది.

06/04/2016 - 06:09

వరంగల్, జూన్ 3: జిల్లా అవుతుందనుకున్న జనగామ చివరకు కొత్తగా ఏర్పాటు కానున్న యాదాద్రిలోనే కలవనుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ప్రభుత్వం కూడా జనగామకు బదులు మహబూబాబాద్‌ను జిల్లాగా చేసేందుకు మొగ్గుచూపుతోంది. వరంగల్ జిల్లాను మూడు జిల్లాలుగా చేయాలని ముందుగా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మహబూబాబాద్, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్, ఆలేరు నియోజకవర్గాలను జనగామలో కలిపి జనగామను జిల్లాగా చేయాలని భావించారు.

06/04/2016 - 06:08

తన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుకు పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్న నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు
.......................

పెన్షన్ రాలేదని
మాజీ సర్పంచ్ ఆత్మహత్య

06/03/2016 - 07:06

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒకే ఒక్క పార్లమెంటు సభ్యుడు మల్లారెడ్డి టీఆర్‌ఎస్‌లోకి ఫిరాయించడంతో, ఇక ఆ పార్టీ ఉనికి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

06/03/2016 - 07:03

హైదరాబాద్, జూన్ 2: తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత గడచిన రెండేళ్లలో కేంద్ర ప్రభుత్వం రూ.2లక్షల కోట్ల రూపాయలు ఇచ్చిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. తెలంగాణ సాధనలో బిజెపి పాత్ర చారిత్రాత్మకమైందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా గురువారం పార్టీ కార్యాలయంలో లక్ష్మణ్ జాతీయ జెండాను ఎగురవేశారు.

Pages