S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

05/19/2016 - 13:20

ఖమ్మం: తెలంగాణ సిఎం కెసిఆర్ చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి పాలేరు నియోజకవర్గ ప్రజలు తనను భారీ మెజారిటీతో గెలిపించారని ఉప ఎన్నికలో గెలిచిన తెరాస అభ్యర్థి, రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఉప ఎన్నికలో గెలిచినట్లు ప్రకటించగానే ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రజల నమ్మకానికి తగ్గట్టు పని చేసి పాలేరు నియోజక వర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానన్నారు.

05/19/2016 - 13:19

హైదరాబాద్: ప్రముఖ తెలుగు సినీనటుడు రవితేజకు ట్రాఫిక్ పోలీసులు 800 రూపాయల జరిమానా విధించారు. గురువారం నాడు జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా రవితేజ కారు అద్దాలకు బ్లాక్‌ఫిల్మ్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బ్లాక్‌ఫిల్మ్ తొలగించనందుకు ఈ జరిమానా విధించారు. ఇటీవల ఇదే కారణంపై నటుడు జూనియర్ ఎన్టీఆర్, తారకరత్నలకు కూడా ట్రాఫిక్ పోలీసులు జరిమానాలు విధించిన సంగతి తెలిసిందే.

05/19/2016 - 12:17

ఖమ్మం: పాలేరు ఉపఎన్నికలో రాష్ట్ర మంత్రి, తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు భారీ మెజారిటీని సాధించారు. ఆయన గెలుపును అధికారులు లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. కౌంటింగ్ ప్రారంభమయ్యాక తొలిరౌండ్ నుంచి ఆయన ఆధిక్యతతో ఉన్నారు. 16వ రౌండ్ పూర్తయ్యేసరికి 49వేల పైచిలుకు మెజారిటీని సాధించారు.

05/19/2016 - 11:17

ఖమ్మం: పాలేరు అసెంబ్లీ స్థానానికి గురువారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి, తెరాస అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు తొలిరౌండ్ నుంచి సమీప కాంగ్రెస్ అభ్యర్థి సుచరితరెడ్డిపై తిరుగులేని ఆధిక్యత కొనసాగిస్తున్నారు. ఇక్కడ తుమ్మల గెలుపు లాంఛనమేనని తేలింది.

05/19/2016 - 07:09

హైదరాబాద్, మే 18: ఉపాధ్యాయుల భర్తీలో జిల్లాస్థాయి నియామకాల వ్యవస్థను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం జీవో 19 జారీ చేశారు. ఈ ఉత్తర్వులతో డి.ఎస్సీ ద్వారా జరగాల్సిన ఉపాధ్యాయ నియామకాలు ఇకపై తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ ద్వారా చేపడతారు.

05/19/2016 - 07:07

హైదరాబాద్, మే 18: తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సిఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో చర్చలు సాగుతున్నాయ. దేశ ప్రధానిగా సేవ లందించిన పివి నరసింహారావుతోపాటు మాజీ ఎంపి చొక్కారావు, ప్రొఫెసర్ జయశంకర్, చాకలి ఐలమ్మ వంటి దివంగతుల పేర్లు పెట్టాలన్న పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

05/19/2016 - 07:04

హైదరాబాద్, మే 18: రాష్ట్రంలో ఆరు జిల్లాల ఎస్సీలకు స్థానం చలనంతోపాటు పలువురు ఐపీఎస్ అధికారులకు బదిలీలు, పదోన్నతులు కల్పిస్తూ సిఎస్ రాజీవ్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు.

05/19/2016 - 06:59

ఖమ్మం, మే 18: పాలేరు ఉప ఎన్నిక ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 16వ తేదీన పాలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగగా 19వ తేదీన ఖమ్మం వ్యవసాయ మార్కెట్ యార్డులో కౌంటింగ్ నిర్వహించనున్నారు. కౌంటింగ్ కోసం 14టేబుళ్ళు ఏర్పాటు చేస్తున్న అధికారులు 17 రౌండ్లుగా ఓట్ల లెక్కింపు జరపనున్నారు.

05/18/2016 - 18:01

హైదరాబాద్: కొత్తజిల్లాల ఏర్పాటు విషయమై ప్రజా ప్రతినిధుల నుంచి అభిప్రాయాలను సేకరించాలని టి.సర్కార్ నిర్ణయించింది. ఈ దిశగా అపుడే కసరత్తు మొదలైంది. రంగారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి మహేందర్‌రెడ్డి బుధవారం సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. రేపోమాపో ఆయన సిఎంకు నివేదిక అందజేస్తారు.

05/18/2016 - 17:49

ఆదిలాబాద్‌ : జిల్లాలోని బాసర జ్ఞానసరస్వతి ఆలయ ప్రాంగణంలో బుధవారం సాయంత్రం పిడుగు పడింది. పిడుగు పడిన సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. తూర్పు రాజగోపురం పాక్షికంగా ధ్వంసమైంది.

Pages