S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

04/01/2016 - 14:00

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన బ్యూటీపార్లర్ యజమాని వరలక్ష్మి వికారాబాద్ మండలం అనంతగిరిపల్లెలో హత్యకు గురైనట్లు శుక్రవారం పోలీసులు కనుగొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపి, ఈ ఘటనపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతురాలు వరలక్ష్మిపై పలు ప్రాంతాల్లో గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిసింది.

04/01/2016 - 14:02

హైదరాబాద్: ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన వాహనం శుక్రవారం నల్లకుంట సమీపంలోని విద్యానగర్‌లో బీభత్సం సృష్టించింది. బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన ఈ వ్యాన్ ఒక్కసారి పాదచారులపై దూసుకుపోయింది. వ్యాన్ ఢీకొనడంతో సాయి ప్రకాష్ అనే చిరుద్యోగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వ్యాన్ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

04/01/2016 - 13:57

హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినప్పటికీ వైస్ చాన్సలర్ అప్పారావును ఇంతవరకూ అరెస్టు చేయకపోవడాన్ని నిరసిస్తూ హెచ్‌సియులో విద్యార్థులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. పరిపాలనా భవనం వద్ద వీరు నిరసనకు దిగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.

04/01/2016 - 13:56

హైదరాబాద్: నగరంలోని చారిత్రక కట్టడమైన చార్మినార్ వద్ద ఫుట్‌పాత్‌ల నిర్మాణాన్ని ఆరునెలల్లోగా పూర్తి చేస్తామని పురపాలక మంత్రి కెటిఆర్ చెప్పారు. ఆయన శుక్రవారం మేయర్ రామ్మోహన్, గ్రేటర్ కమిషనర్ జనార్దన రెడ్డితో కలిసి చార్మినార్ ప్రాంతంలో పర్యటించారు. ఇక్కడ ట్రాఫిక్‌ను నియంత్రించేలా ఇన్నర్, అవుటర్ రింగ్ రోడ్డులు నిర్మిస్తామని, నగర చరిత్రను తెలిపేలా ఆర్టు గ్యాలరీని ఏర్పాటు చేస్తామన్నారు.

04/01/2016 - 13:55

నిజామాబాద్: తెలంగాణ సిఎం కెసిఆర్ జిల్లాలో నేడు,రేపు జరిపే పర్యటనకు అధికారులు అన్ని సన్నాహాలు పూర్తి చేస్తారు. నర్సింపల్లి వేంకటేశ్వర ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న తర్వాత ఈరోజు సాయంత్రం ఇక్కడ జిల్లా అధికారులతో కరవు పరిస్థితులపై ఆయన సమీక్షిస్తారు. రాత్రికి బాన్స్‌వాడ చేరుకుని అక్కడే బసచేస్తారు.

04/01/2016 - 12:04

నల్గొండ: వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృష్ణాబోర్డు ఆదేశాల మేరకు అధికారులు నాగార్జున సాగర్ ఎడమకాలువకు శుక్రవారం ఉదయం మూడు వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ప్రజల తాగునీటి అవసరాలకు 4.5 టిఎంసిల నీటిని వినియోగించుకునే వీలుంది. ప్రస్తుతం సాగర్ జలాశయంలో నీటిమట్టం 508 అడుగుల మేరకు ఉంది.

04/01/2016 - 12:04

హైదరాబాద్: ఈదురుగాలులతో కూడిన వర్షం పడడంతో కరీంనగర్, వరంగల్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో మామిడి తదితర పంటలకు నష్టం జరిగింది. కొన్ని చోట్ల వడగళ్ల వాన కురిసింది. పిడుగుపాటుకు గురువారం అయిదుగురు మరణించారు. ఉత్తర కోస్తా, తెలంగాణ, రాయలసీమలో శుక్రవారం వర్షం కురిసే అవకాశం ఉంది.

04/01/2016 - 12:02

నల్గొండ: నల్గొండ పరిసర ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న అయిదుగురు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. ఓ రైస్‌మిల్లులో వీరు దోచుకున్న 1.35 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు.

04/01/2016 - 12:02

మహబూబ్‌నగర్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన గృహిణి శరీరంపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని గురువారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. అడ్డాకుల మండలం మూసాపేటలో ఈ ఘటన జరిగింది.

04/01/2016 - 04:19

హైదరాబాద్, మార్చి 31: ప్రభుత్వ జీవోల వెబ్‌సైట్‌ను మూడు వారాల్లోగా పునరుద్దరిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ప్రజలు ఈ వెబ్‌సైట్‌ను సందర్శించేందుకు వీలుగా అన్ని విధాల పొందుపరుస్తామని వెల్లడించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్ కుమార్‌కు తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది నజీబ్ ఖాన్ వివరణ ఇస్తూ ఈ విషయాన్ని తెలియజేశారు.

Pages