S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2016 - 06:02

వరంగల్: 2016- 17 విద్యాసంవత్సరానికి ఎంబిఏ, ఎంసిఏలో ప్రవేశాలకు ఐసెట్ - 2016 మే 19వ తేదీన నిర్వహించడానికి ఏ ర్పాట్లు చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, ఐసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ఓంప్రకాష్ తెలిపారు. హైదరాబాద్‌లో గురువారం ఐసెట్‌కు సంబంధించిన వివరాలను వారు వెల్లడించారు.

02/26/2016 - 05:59

వరంగల్: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కాకపోవడంతో ఆ పార్టీ ఆశావాహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుండి ఇప్పటికే అనేకమంది నాయకులు టిఆర్‌ఎస్‌లో చేరడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనలో జాప్యం జరుగుతుంది.

02/26/2016 - 05:58

బాసర: చదువుల తల్లి కొలువైన ఆదిలాబాద్ జిల్లా బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి ఆలయానికి గురువారం భక్తజనం పోటెత్తారు. తదియ శుభ ముహూర్తాన్ని పురస్కరించుకుని అమ్మవారి చెంత తమ చిన్నారులకు అక్షర స్వీకార పూజలు నిర్వహించడానికి ఉభయ తెలుగు రాష్ట్రాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం 12 గంటల వరకే శుభగడియలు ఉండడంతో వెయ్యి రూపాయల అక్షర స్వీకార పూజలకు భక్తులు క్యూలైన్‌లో బారులు తీరారు.

02/26/2016 - 05:57

కొత్తగూడ: మేడారం సమ్మక్క - సారలమ్మ జాతరలో వివాహం జరిగిన అనంతరం పగిడిద్దరాజు పూనుగొండ్ల చేరుకున్నాక నాగవెల్లి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగానే తిరుగు వారం జాతరను అంగరంగ వైభవంగా గురువారం నిర్వహించారు. భక్తులు పూజలు నడుమ ప్రధాన అర్చకులు సమీపంలోని అడవికి వెళ్లి వనం (వెదురు) తెచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు.

02/26/2016 - 05:09

ఖమ్మం: ఖమ్మం కార్పొరేషన్‌లో అన్ని పార్టీలకు రెబల్స్ బెడద అధికంగా ఉంది. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 26వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు సమయం ఉన్నప్పటికీ నామినేషన్లు వేసిన వారిలో ఒక్కరు కూడా ఉపసంహరించుకునేందుకు ఆసక్తి చూపకపోవటంతో ఆయా పార్టీల నేతలు తలలు పట్టుకుంటున్నారు. చివరికి కమ్యూనిస్టు పార్టీలకు కూడా రెబల్స్‌బెడద తప్పలేదు.

02/26/2016 - 04:59

హైదరాబాద్: పేదల ముఖాల్లో చిరునవ్వులు కనిపించిన రోజే సాధించుకున్న తెలంగాణకు సార్థకత అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభిప్రాయం వ్యక్తం చేశారు. టిడిపి శాసన సభాపక్ష నాయకుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కాంగ్రెస్‌పార్టీకి చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, ఆ రెండు పార్టీలకు చెందిన పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గురువారం తెరాసలో చేరారు.

02/25/2016 - 18:07

హైదరాబాద్: తెరాసలో ఎవరు చేరినా అది రాజకీయశక్తుల పునరేకీకరణ అవుతుందని తెలంగాణ సిఎం కెసిఆర్ అన్నారు. ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించడంతో ఇక తెలంగాణ అన్ని విధాలా అభివృద్ధి సాధిస్తుందన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర రావుకు తెరాస కండువా వేసి ఆయన ఆహ్వానించారు. కెసిఆర్ సమక్షంలో ఎర్రబెల్లి తన అనుచరులతో తెరాసలో అధికారికంగా చేరారు.

02/25/2016 - 17:52

హైదరాబాద్ : హైదరాబాద్‌‌లో జరిగిన తుంగభద్ర బోర్డు సమావేశంలో తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ అధికారులు పాల్గొన్నారు. తుంగభద్ర కాల్వల ఆధునీకరణ పనులకు బోర్డు ఆమోదం తెలిపింది. తెలంగాణ ప్రస్తావించిన అంశాలపై వచ్చే సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

02/25/2016 - 17:48

హైదరాబాద్ : తెలంగాణ త్వరలో విద్యుత్ మిగులు రాష్ట్రంగా అవతరిస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం విద్యుత్‌శాఖపై కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. భుత్వరంగ విద్యుత్‌ సంస్థలకు సహకరిస్తామని తెలిపారు. వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని వెల్లడించారు.

02/25/2016 - 14:28

ఖమ్మం: ఓ రిటైర్డు ఉద్యోగి నుంచి రెండు వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా ఇక్కడి కలెక్టర్ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ టి.శ్రీనివాసరావును గురువారం నాడు ఎసిబి అధికారులు వలపన్ని పట్టుకున్నారు.

Pages