S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ

02/26/2016 - 16:03

హైదరాబాద్ : వరంగల్‌, ఖమ్మం మేయర్‌, డిప్యూటీ మేయర్, అచ్చంపేట మునిసిపల్‌ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ ఎన్నికకు షెడ్యూల్ ఖరారు చేశారు. మార్చి 11న నోటిఫికేషన్ జారీ చేస్తారు. 15న ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది.

02/26/2016 - 16:00

హైదరాబాద్ : తమ సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ సమితి ఆధ్వర్యంలో నర్సులు శుక్రవారం ఇందిరా‌పార్కులో రిలే నిరాహారదీక్షలు ప్రారంభించారు. బీజేఎల్పీ నేత లక్ష్మణ్ నర్సులకు సంఘీభావం తెలిపారు.

02/26/2016 - 15:58

హైదరాబాద్‌: తెలంగాణలో అదనపు డీజీలుగా రాజీవ్‌ రతన్‌, సీవీ ఆనంద్‌, ఐజీలుగా విక్రంసింగ్‌మాన్‌, ఆర్‌.బి.నాయక్‌, బి.మల్లారెడ్డి, టి.మురళీకృష్ణ, ఎం.శివప్రసాద్‌, రాజేశ్‌కుమార్‌, ఎన్‌.శివశంకర్‌రెడ్డిలకు పదోన్నతి లభించింది.

02/26/2016 - 11:58

ఖమ్మం: సత్తుపల్లి మండలం చంద్రాయపాలెంలో ప్రభుత్వ పాఠశాల హెడ్‌మాస్టర్ విజయకుమార్ ఆత్మహత్య చేసుకున్నట్లు శుక్రవారం ఉదయం ఆత్మహత్య చేసుకున్నట్టు స్థానికులు కనుగొన్నారు. ఆత్మహత్యకు కారణాలింకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు.

02/26/2016 - 11:55

సికిందరాబాద్: బోయగూడలో జిహెచ్‌ఎంసి ఉద్యోగి సాయి కుమార్‌పై గురువారం అర్ధరాత్రి కొంతమంది కత్తులతో దాడి చేసి గాయపరిచారు. సాయికుమార్‌ను వెంటనే ముషీరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పాత కక్షలను దృష్టిలో పెట్టుకొని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బంధువులే దాడికి పాల్పడ్డారని బాధితుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

02/26/2016 - 11:54

నిజామాబాద్: డిచ్‌పల్లి మండలం తిరుమన్‌పల్లిలో ఓ మహిళను దారుణంగా హత్యచేసి మృతదేహాన్ని తగులబెట్టిన ఉదంతం శుక్రవారం ఉదయం వెలుగు చూసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

02/26/2016 - 11:53

ఆదిలాబాద్: నేరేడుగొండలో శుక్రవారం ఉదయం వేగంగా వస్తున్న ఓ బైక్ అదుపుతప్పి కారును ఢీకొంది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులను బోధ్ మండలం పొచ్చర్ల గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు.

02/26/2016 - 07:31

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రీసెర్చి స్కాలర్ వేముల రోహిత్ ఆత్మహత్య పూర్వాపరాలపై ఏకసభ్య కమిషన్ జస్టిస్ అశోక్ కుమార్ రూపన్‌వాలా గురువారం నాడూ నాంపల్లి గోల్డెన్ థ్రెషోల్డ్ దూర విద్యా కేంద్రం (సిడివిఎల్)లో విచారణ కొనసాగించారు.

02/26/2016 - 07:30

హైదరాబాద్, ఫిబ్రవరి 25: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆక్రమిత ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ సకాలంలో పూర్తిచేయకపోవడంతో అక్రమ భవన నిర్మాణాల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకునే అర్హత కోల్పోయే పరిస్థితి నెలకొంది.

02/26/2016 - 07:17

హైదరాబాద్: రైల్వే బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలకూ మొండిచెయ్యే చూపించింది. కాజీపేటను రైల్వే డివిజన్‌గా చేయాలన్నది చిరకాల డిమాండ్. ఈసారి బడ్జెట్‌లో ఈమేరకు ప్రకటన చేస్తారని భావించినా నిరాశే ఎదురైంది. ఇక కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై టిఆర్‌ఎస్ ఎంపిలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్రం నుంచి ఎంపిలు పంపిన ప్రతిపాదనల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకే ప్రాధాన్యత ఇచ్చారు.

Pages