S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/21/2015 - 14:16

నెల్లూరు : వరద సహాయక చర్యలపై నెల్లూరులోని ఉమేశ్‌చంద్ర టౌన్‌హాల్‌లో ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఏపీ మంత్రులు నారాయణ, శిద్దా రాఘవరావు, పరిటాల సునీత, దేవినేని ఉమామహేశ్వరరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. భారీ వర్షాల కారణంగా మృతిచెందిన 5 కుటుంబాలకు రూ.5లక్షల చొప్పున సీఎం పరిహారం అందజేశారు.

11/21/2015 - 13:58

హైదరాబాద్: గచ్చిబౌలిలోని టీ హబ్ లో ఇన్నోఫెస్టును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. సామాన్యులకు ఉపయోగపడే చాలా రకాల పరికరాలను ప్రతినిధులు ఆవిష్కరించారని తెలిపారు. టీ హబ్ ద్వారా తెలంగాణ టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు.

11/21/2015 - 13:55

హైదరాబాద్ : తన భర్తను ఎన్‌కౌంటర్ చేస్తారేమోనని పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డి భార్య మాళవిక ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబు తో తమకు ప్రాణ హాని ఉందని, దీనిపై ఇదివరకే గవర్నర్‌కు కూడా ఓ లేఖ రాశామని ఆమె చెప్పారు. ఆ తర్వాతే గంగిరెడ్డిని టార్గెట్ చేశారన్నారు.

11/21/2015 - 13:41

హైదరాబాద్ : వరద బాధిత జిల్లాలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఏరియల్‌ సర్వే చేస్తున్నారు. చిత్తూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో వరద నష్టాన్ని పరిశీలించారు. వరద బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించారు. వరద బాధితులకు బీజేపీ అధ్యక్షులు అమిత్ షా కోటి రూపాయిలు విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. స్వయంగా ఆయనే కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుకు ఫోన్ చేసి విరాళం ఇస్తున్నట్లు చెప్పారు.

11/21/2015 - 13:33

హైదరాబాద్‌ : నాలుగు రోజుల క్రితం చర్ల మండలం పూసుగుప్ప అటవీప్రాంతంలో అపహరించిన తెరాస నాయకులను శనివారం ఉదయం మావోయిస్టులు విడుదల చేశారు. తెరాస నాయకులు మానె రామకృష్ణ, జనార్దన్‌, డెక్కా సత్యనారాయణ, పటేల్‌ వెంకటేశ్వర్లు, రామకృష్ణ, సురేశ్‌లను విడుదల చేశారు. దీంతో తెరాస నాయకులు ఈ ఉదయం చర్ల చేరుకున్నారు.

11/21/2015 - 06:18

హైదరాబాద్, నవంబర్ 20: వైట్నర్, ఇతర చౌక రకం మత్తు పదార్ధాలకు బానిసలవుతున్న బాలలను ఆదుకోవాలని, ఈ మత్తు పదార్ధాల విక్రయాలపై తీసుకుంటున్న చర్యలపై నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆంధ్ర, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది.

11/21/2015 - 06:11

విశాఖపట్నం, నవంబర్ 20: మానవ తప్పిదాల వలనే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయని నిపుణులు అభిప్రాయపడ్డారు. విశాఖలో జరుగుతున్న విపత్తుల నిర్వహణపై రెండో ప్రపంచ సదస్సులో భాగంగా రెండో రోజైన శుక్రవారం రెండు ప్లీనరీలు, తొమ్మిది సెషన్స్ జరిగాయి. రెండో రోజు సదస్సులో చర్చించిన అంశాల గురించి సాయంత్రం సదస్సు ప్రతినిధులు వివరించారు.

11/21/2015 - 06:10

హైదరాబాద్, నవంబర్ 20: అక్రమ నిర్మాణం జరుగుతోందని ఫిర్యాదు చేసినా జిహెచ్‌ఎంసి అధికారులు స్పందించలేదంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు శుక్రవారం తీవ్రంగా స్పందించింది. ఫిర్యాదు చేసినా స్పందించక పోవడానికి కారణం ఏమిటో ఈ నెల 24న కోర్టుకు హాజరై సంజాయిషి ఇవ్వాల్సిందిగా జిహెచ్‌ఎంసి కమిషనర్‌ను హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.

11/21/2015 - 06:10

హైదరాబాద్, నవంబర్ 20: దేశంలో విద్యాబోధన స్వభావం మారిందని, తదనుగుణంగా విద్యార్ధులు ఆధునికతను అందిపుచ్చుకుని ప్రపంచమార్కెట్‌కు దీటుగా సిద్ధం కావాలని ఇగ్నో మాజీ విసి, ‘నేక్’మాజీ డైరెక్టర్, ఏసియా పసిఫిక్ క్వాలిటీ ఎడ్యుకేషన్ నెట్ వర్క్ వైస్ ప్రెసిడెంట్ ప్రొఫెసర్ వి ఎస్ ప్రసాద్ పేర్కొన్నారు.

11/21/2015 - 06:09

హైదరాబాద్, నవంబర్ 20: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని, తమకు కావాల్సిన కాంట్రాక్టులకు ఏకపక్షంగా పనులు కేటాయిస్తూ కోట్లాది రూపాయల నిధుల మళ్లింపుకు టిడిపి ప్రభుత్వం పాల్పడుతోందని వైకాపా తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తింది.

Pages