S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/26/2015 - 07:59

విజయవాడ, నవంబర్ 25: అకారణంగా భూముల విలువలను, ఇంటి అద్దెలను పెంచుకుంటూ పోతుంటే విజయవాడ నగరం ఎన్నటికీ కూడా అభివృద్ధి చెందబోదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగర వాసులను సున్నితంగా హెచ్చరించారు. నగర భవిష్యత్ కోసం అవసరమైతే అత్యాశకు పోకుండా త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడాలన్నారు.

11/26/2015 - 07:58

రాజమండ్రి, నవంబర్ 25: పంట చేతికొస్తున్నా సడలింపు ఉత్తర్వులు రాక గోదావరి జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సొంతంగా వ్యవసాయం చేస్తున్న రైతులే తీవ్ర ఆందోళన చెందుతుంటే, కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. తేమశాతం 20 నుండి 22 దాటిపోతున్న పరిస్థితుల్లో రాష్ట్రప్రభుత్వం తెరిచిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రైతులు వెళ్లలేక, దళారులపై ఆధారపడుతున్నారు.

11/26/2015 - 07:57

శ్రీశైలం/విజయవాడ/రాజమండ్రి/్భద్రాచలం, నవంబర్ 25: రాష్ట్ర వ్యాప్తంగా కోటి దీపార్చన జరిగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీశైలంలో బుధవారం సాయంత్రం పాతాళగంగ వద్ద నదీహారతి, ఆలయం వద్ద జ్వాలాతోరణం కన్నులపండువగా నిర్వహించారు. భక్తులు తెల్లవారుజామునే పాతాళగంగలలో పుణ్యస్నానాలు ఆచరించి నదిలో కార్తీకదీపాలు వదిలారు. క్యూలైన్లలో నిలుచుని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

11/26/2015 - 07:48

గుర్రంకొండ, నవంబరు 25: చిత్తూరు జిల్లా మండల కేంద్రమైన గుర్రంకొండలో బుధవారం పాఠశాల పైకప్పు కూలడంతో ఒక చిన్నారి అప్సర(7) శిథిలాల కిందపడి మృతిచెందింది. ఈప్రమాదంలో మరో 14మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలావున్నాయి. గుర్రంకొండలో గత ఏడాది ఇండియన్ పబ్లిక్‌స్కూల్ పేరిట ఓ ప్రైవేటు పాఠశాల ప్రారంభమైంది.

11/26/2015 - 07:48

రాజమండ్రి, నవంబర్ 25: పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నాలుగేళ్లలో పూర్తిచేస్తామని పదే పదే హామీలిస్తున్న రాష్ట్రప్రభుత్వం దానికి అనుగుణంగా కసరత్తు ప్రారంభించింది. పోలవరం ప్రాజెక్టులో అత్యంత కీలకమైన హెడ్‌వర్క్స్ పనులు ఇపుడు సాగుతున్నట్టే సాగితే మరో పదేళ్లయినా పూర్తికావన్న నిర్ణయానికి వచ్చిన రాష్ట్రప్రభుత్వం కొన్ని పనులను సబ్-కాంట్రాక్టుకు ఇవ్వాలని భావిస్తోంది.

11/26/2015 - 07:47

హైదరాబాద్, నవంబర్ 25 : ‘‘శీఘ్రమేవ మనోవాంఛా సిద్ధిరస్తు’’ అంటూ దేవాలయాల్లో భక్తులను ఆశీర్వదించే అర్చకుల సమస్యలు మాత్రం నెలల తరబడి పరిష్కారం కావడం లేదు. ఎప్పుడు పరిష్కారం అవుతాయో కూడా తెలియడం లేదు. ప్రభుత్వం సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ సమస్యల పరిష్కారంలో అడుగడుగునా అవరోధాలే ఏర్పడుతున్నాయి.

11/26/2015 - 05:32

హైదరాబాద్/ కాకినాడ, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీసు కమిషన్ చైర్మన్‌గా ప్రొఫెసర్ పి ఉదయ భాస్కర్‌ను ప్రభుత్వం బుధవారం నియమించింది. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా ఉదయ భాస్కర్ పేరు వినిపిస్తున్నా అనేక కారణాల వల్ల ఆయన నియామకంలో జాప్యం జరిగింది. ఉదయ భాస్కర్ కాకినాడ ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఇటీవలే డైరెక్టర్ ఆఫ్ ఇవాల్యూయేషన్‌గా కూడా నియమితులయ్యారు.

11/26/2015 - 05:29

హైదరాబాద్, నవంబర్ 25: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్ధిక అవసరాల కోసం, వరద సాయంగా కేంద్రప్రభుత్వం 700 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వరద సాయం కింద తక్షణమే వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ నాలుగు రోజుల కిందట ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆ తర్వాత తమిళనాడు ప్రభుత్వం సైతం వరద సాయం ప్రకటించాలని కేంద్రానికి లేఖ రాసింది.

11/26/2015 - 05:23

హైదరాబాద్, నవంబర్ 25: పోలీసులు, సైబర్ నిపుణుల కళ్లుగప్పి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ఉగ్రవాదులు తమ సమాచారాన్ని పరస్పరం మార్పిడి చేసుకుంటున్నారు. మొదటి నుంచి హైదరాబాద్ పరిసరాలు, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఉగ్రవాద సానుభూతిపరులున్న ప్రాంతాలుగా ముద్రపడటంతో, వీరి కదలకలపై పోలీసులు నిఘా పెంచారు.

11/26/2015 - 05:21

గుంటూరు, నవంబర్ 25: జలసంపద, పచ్చదనం, అభివృద్ధి మేళవించిన సుందర రాజధాని నగరంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు ప్రజలంతా మమేకం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. అలాగే హరితాంధ్ర ప్రదేశ్ లక్ష్య సాధనలోనూ ప్రతిఒక్కరూ పాలుపంచుకోవాలన్నారు.

Pages