S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/12/2015 - 02:14

గుంటూరు, డిసెంబర్ 11: గ్రామాలు, జిల్లాలను సమగ్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఎన్ని వనరులు కల్పించినప్పటికీ, ప్రజా భాగస్వామ్యంతోనే సత్ఫలితాలు సాధించవచ్చని సిఎం చంద్రబాబు అన్నారు. శుక్రవారం గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపాల్టీ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు 310 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను సమీక్షించి, స్పీకర్ కోడెల శివప్రసాద రావును పొగడ్తలతో ముంతెచ్చారు.

12/12/2015 - 02:10

విజయవాడ, డిసెంబర్ 11: ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడలో సరికొత్త రాక్షస గ్యాంగ్ వెలుగులోకి వచ్చింది. ఈ మాఫియా వికృత చేష్టలు, అకృత్యాలు అంతాఇంతా కాదు. కాల్‌మనీ ముసుగులో ఎందరో మహిళలను ట్రాప్‌చేసి లైంగిక దాడులకు పాల్పడటమే కాకుండా, కొందరు పెద్దల వద్దకు వారిని పంపుతూ పనులు చక్కబెట్టుకుంటున్నారు. గుట్టుచప్పుడు కాకుండా చాలాకాలంగా సాగుతున్న అనైతిక వ్యవహారం ఒక్కసారిగా బట్టబయలైంది.

12/11/2015 - 18:00

విజయవాడ : వర్షాలు, వరదల వల్ల రాష్ట్రంలో రూ.3,760 కోట్ల నష్టం వాటిల్లిందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందాలకు వివరించారు. రాష్ట్రంలో వరదలు, కరవు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందాలు ఈరోజు విజయవాడలో సీఎం చంద్రబాబుతో వేర్వేరుగా భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా వారితో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఉదారంగా ఆదుకోవాలని కోరారు.

12/11/2015 - 15:57

మెదక్‌: జిల్లాలో ఎమ్మెల్సీ స్థానానికి తెరాస అభ్యర్థి భూపాల్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. ఈ స్థానానికి నామినేషన్లు వేసిన తెదేపా అభ్యర్థి బాల్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి శివరాజ్‌పాటిల్‌ తమ నామినేషన్లను ఈరోజు ఉపసంహరించుకున్నారు. దీంతో మెదక్‌ ఎమ్మెల్సీ స్థానం తెరాస వశమైంది.

12/11/2015 - 15:23

హైదరాబాద్ : సరోజనీదేవి కంటి ఆసుపత్రిలో రోగులు ఆందోళనకు దిగారు. గత నాలుగు రోజుల నుంచి ఆసుపత్రిలో నీటి కొరత ఏర్పడింది. దీంతో 108 శస్త్ర చికిత్సలు ఆగిపోయాయి. రోగులు ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని ఆందోళనకు దిగారు. రేపటిలోగా సమస్యను పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వటంతో రోగులు ఆందోళన విరమించారు.

12/11/2015 - 15:21

చిత్తూరు : చిత్తూరు నగర మేయర్ అనురాధ దంపతుల హత్యకేసులో మరోకరిని అరెస్టు చేశారు. చింటూ డ్రైవర్ వెంకటేష్‌ను అరెస్టు చేసి అతని వద్ద నుంచి తల్వార్, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. కాగా మేయర్ హత్యకేసులో నిందితుల సంఖ్య 20కి చేరింది. చింటూ డ్రైవర్ వెంకటేష్ ఐదవ నిందితుడని డీఎస్పీ వెల్లడించారు.

12/11/2015 - 08:19

నెల్లూరు, డిసెంబర్ 10: ఓ హెడ్మాస్టరు సుమారు మూడు కోట్ల మేర అక్రమ ఆస్తులు కలిగి, ఏసిబి అధికారులకు చిక్కిన వైనం ఇది. ఏసిబి అధికారుల కథనం మేరకు నెల్లూరు నగరంలోని మూలాపేట బ్రాహ్మణవీధిలో నివాసం ఉంటున్న బూదం సురేష్ అక్రమ ఆస్తి కలిగి ఉన్నాడని ఎసిబి అధికారులకు అందిన సమాచారంతో గురువారం ఆయన ఆస్తులపై సోదాలు చేపట్టారు.

12/11/2015 - 08:19

20న తెప్పోత్సవం... 21న ఉత్తరద్వార దర్శనం

12/11/2015 - 08:17

జగదేవ్‌పూర్, డిసెంబర్ 10: ఈ నెల 23నుండి 27వరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెదక్ జిల్లా జగదేవ్‌పూర్‌లోని తన ఫాంహౌస్‌లో నిర్వహించతలపెట్టిన అయుత చండీయాగానికి ఏర్పాట్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. రాష్ట్ర సుభిక్షం కోసం కెసిఆర్ తలపెట్టిన ఈ యాగం పనుల ఏర్పాట్లు నిజామాబాద్ జిల్లా బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి సమక్షంలో చురుకుగా కొనసాగుతున్నాయి.

12/11/2015 - 08:17

హైదరాబాద్, డిసెంబర్ 10: దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్‌గా ఎస్‌ఎన్ సింగ్ గురువారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 1980వ, బ్యాచ్‌కు చెందిన ఎస్‌ఎన్ సింగ్ మూడు దశాబ్దాలుగా వివిధ శాఖల్లో పనిచేశారు. స్వీడన్, జపాన్, జర్మన్ దేశాలకు వెళ్లి అక్కడి టెక్నాలజీ, రైల్వే ట్రాక్ సిస్టంపై అధ్యయనం చేసి భారత రైల్వే ట్రాక్ విధానాన్ని మెరుగుపరిచారు.

Pages