S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

11/28/2015 - 03:33

విజయవాడ, నవంబర్ 27: వచ్చే ఆర్థిక సంవత్సరంలో 15శాతం వృద్ధిరేటు సాధించాలన్న రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యానికి హైదరాబాద్ సచివాలయంలో శనివారం జరిగే ఉన్నతాధికారుల సమావేశం దిశానిర్దేశం చేయనుంది. స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం, లక్ష్య సాధనకు నిధుల అవసరమెంతో లెక్కించడం, వనరుల సమీకరణ తదితర అంశాలపై స్పష్టతకు రావడం స్థూలంగా శనివారం జరగబోయే సమావేశం ఉద్దేశాలు.

11/28/2015 - 03:32

హైదరాబాద్, నవంబర్ 27: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన ఓటుకు నోటు కేసు కీలక మలుపుతిరిగింది. జంట రాష్ట్రాలను ఒక కుదుపు కదిపేసిన కేసు వ్యవహారం శుక్రవారం కీలక దశకు చేరింది. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నామినేటేడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షలు ఇస్తూ తెదేపా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఏసిబి అధికారులకు అడ్డంగా దొరికిపోయిన విషయం విదితమే.

11/27/2015 - 16:56

సికింద్రాబాద్‌: రైల్వేస్టేషన్‌లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఇద్దరు వ్యక్తుల నుంచి 2 కిలోల బంగారం, అరకిలో వెండి, 11 గ్రాముల వజ్రాలు స్వాధీనం చేసుకున్నారు. ధ్రువపత్రాలు లేకుండా విజయవాడ తరలిస్తుండగా రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

11/27/2015 - 16:08

హైదరాబాద్‌ : సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను జనవరి 26న విడుదల చేస్తామని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. మలక్‌పేటలో జైళ్లశాఖ హెడ్‌క్వార్టర్స్‌ను మంత్రి ప్రారంభించారు. చంచల్‌గూడ జైలు తరలింపుపై కేబినెట్‌ నిర్ణయం తీసుకుంటుందని మంత్రి వివరించారు.

11/27/2015 - 15:40

హైదరాబాద్ : వరంగల్ లోక్ సభ ఉపఎన్నిక ప్రజా తీర్పు కాదని,ఈవీఎంలను మానిప్లేట్ చేసి టీఆర్ఎస్ గెలిచిందని కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో సర్వే సత్యనారాయణ విలేకర్లతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈవీఎంల మానిప్లేట్ పై ప్రత్యేక కమిషన్ తో బహిరంగ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని సర్వే సత్యనారయణ డిమాండ్ చేశారు.

11/27/2015 - 13:46

హైదరాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తెలంగాణలో భూముల రీసర్వే నిర్వహిస్తామని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ తెలిపారు. హైదరాబాద్‌లోని తాజ్ డెక్కన్ హోటల్‌లో సెంటర్ ఫర్ ల్యాండ్ యూజ్ మేనేజ్‌మెంట్ ఆధ్వర్యంలో శుక్రవారంనాడు జాతీయ భూ సర్వే విధానం-ల్యాండ్ రికార్డ్ ఆధునిక పద్ధతులు అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ భూ సర్వేకు కేంద్రం నిధులు కూడా ఇచ్చిందని అన్నారు.

11/27/2015 - 07:55

* ఆశనిపాతంగా పర్యావరణ అభ్యంతరాలు
* 25వేల మెగావాట్ల విద్యుదుత్పత్తిపై ప్రతికూల ప్రభావం!

11/27/2015 - 07:55

* ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించిన పోలీసులు
* సొంత పూచీకత్తుపై విడుదల

11/27/2015 - 07:54

సూర్యాపేటలో వరుస ఘటనలతో కలకలం

11/27/2015 - 07:50

ఇంటలిజెన్స్ దర్యాప్తు

Pages