S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్ట్రీయం

12/24/2015 - 06:33

రాజమండ్రి, డిసెంబర్ 23: రవాణాశాఖలో ప్రయివేటీకరణ ఆందోళన మొదలయింది. వచ్చే ఏడాది నుండి రవాణాశాఖలోని వివిధ సేవలను ప్రయివేటు సంస్థలకు అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న సమాచారంతో రవాణా శాఖలోని అధికారులు, సిబ్బందితో పాటు మోటారు వాహనాల యజమానులు కూడా ఆందోళనకు గురవుతున్నారు. రవాణా శాఖ సుమారు 58రకాల సేవలను అందిస్తుంది.

12/24/2015 - 06:33

రాజమండ్రి, డిసెంబర్ 23: కోనసీమ రైల్వే ప్రాజెక్టు సాధనకు హౌరా-చెన్నై మార్గంలో ఐదు రోజుల పాటు రైళ్ల రాకపోకలను స్తంభింపజేయాలని, అప్పుడే ప్రభుత్వం దిగి వస్తుందని మాజీ ఎంపి జివి హర్షకుమార్ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రైళ్ల స్తంభనకు ప్రస్తుత ఎంపిలు నాయకత్వం వహిస్తే, తాను కూడా ఉద్యమంలో పాల్గొంటానన్నారు.

12/24/2015 - 06:32

నెల్లూరు, డిసెంబర్ 23: నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట కేంద్రంగా ప్రతి ఏటా జనవరిలో సూళ్ళూరుపేటలో ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట పక్షుల పండగను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ప్రభుత్వం రాష్ట్ర పండుగుగా గుర్తించి పక్షుల పండుగ నిర్వహిస్తోంది. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా పక్షులకు పండుగ చేయరు. కానీ నెల్లూరు జిల్లాలో చేస్తుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

12/24/2015 - 06:05

తిరుపతి, డిసెంబర్ 23: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ తిరుమలకు రానున్నారు. 25న సాయంత్రం 4.30 గంటల నుండి 5 గంటల ప్రాంతంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. 25న 1.35 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి 2.15 గంటలకు రేణిగుంట విమానాశ్రాయానికి చేరుకొంటారు. అక్కడి నుండి రోడ్డు మార్గాన తిరుమల పద్మావతి అతిథి గృహానికి చేరుకొంటారు. 4.30 గంటలకు శ్రీవారి ఆలయానికి చేరుకొంటారు.

12/24/2015 - 06:04

గుంటూరు, డిసెంబర్ 23: యావత్ విశ్వానికి తొలినాళ్ల నుంచీ ఆధ్యాత్మికపరంగా దిశానిర్దేశం చేసిన మన ప్రాచీనమైన సనాతన ధర్మాన్ని ఆచరించినట్లైతే శుభాలు చేకూరుతాయని విశ్వగురు పీఠాధిపతి విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ఉద్బోధించారు. గుంటూరు సమీపంలోని చినకొండ్రుపాడు విశ్వనగర్‌లోని విశ్వగురు పీఠంలో గురువారంనుంచీ ప్రారంభమవుతున్న గురు దత్తజయంతి మహోత్సవాన్ని పురస్కరించుకుని స్వామిజీ ప్రత్యేక సందేశం ఇచ్చారు.

12/24/2015 - 06:01

హైదరాబాద్, డిసెంబర్ 23: హైదరాబాద్‌లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోతున్నారు. నగర శివారుల్లో గత మూడు రోజుల్లో ఆరు చైన్ స్నాచింగ్‌లు జరిగాయి. బుధవారం రాజేంద్రనగర్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన లక్ష్మీబాయి అనే మహిళ తన ఇంటి ముందు పూలు కోస్తుండగా బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోని ఆరు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు.

12/24/2015 - 05:57

హైదరాబాద్, డిసెంబర్ 23: వైకాపా ఎమ్మెల్యే రోజా సస్పెన్షన్‌పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో ఆత్మరక్షణలో పడిన తెలుగుదేశం పార్టీ... శాసనసభ తీసుకున్న నిర్ణయం సమంజసమైనదనే వాదనను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

12/24/2015 - 05:56

హైదరాబాద్, డిసెంబర్ 23: చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో రాక్షస పాలన చేస్తోందని, ప్రజావ్యతిరేక విధానాలపై అసెంబ్లీ లోపల, వెలుపల పోరాడుతామని వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రకటించారు.

12/24/2015 - 05:05

విశాఖపట్నం, డిసెంబర్ 23: పెట్రోల్, కెమికల్, పెట్రోకెమికల్ ఇనె్వస్ట్‌మెంట్ రీజియన్ (పిసిపిఐఆర్) ఇక లేనట్టే. ఇప్పటి వరకూ ఇందుకోసం చేపట్టిన పనులన్నీ వృథా అయిపోయినట్టే, ఇందుకోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ కూడా ఎందుకూ పనికిరాకుండా పోయింది. ఇప్పటికే సర్వేలు, భూసేకరణ, మాస్టర్ ప్లాన్‌ల కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

12/24/2015 - 05:02

విజయవాడ, డిసెంబర్ 23: గత ఏడేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రతిపక్ష హోదాలో ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులపైనేగాక ప్రజా సమస్యలపై కూడా రోడ్డెక్కి రాజీలేని పోరాటం సాగించిన నారా చంద్రబాబు నాయుడుకు నేడు ఉద్యమాలంటే అసలు గిట్టడం లేదు.

Pages