S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/16/2016 - 03:07

వడోదర, ఫిబ్రవరి 15: సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఈ జట్టు అస్సాంను 10 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ 45 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా సౌరాష్ట్ర 353 పరుగులు చేసింది.

02/16/2016 - 03:07

రాంచీ, ఫిబ్రవరి 15: మహిళల క్రికెట్‌లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌ని భారత జట్టు 107 పరుగుల భారీ ఆధిక్యంతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మందన (55), హర్‌మన్‌ప్రీత్ కౌర్ (50) అర్ధ శతకాలతో రాణించారు.

02/16/2016 - 03:06

కరాచీ, ఫిబ్రవరి 15: పాకిస్తాన్ క్రీడాకారులకు వాహెబ్ రియాజ్, అహ్మద్ షెజాద్‌లకు అధికారులు జరిమానా విధించారు. దుబాయ్‌లో పిఎస్‌ఎల్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావల్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరినొకరు తోసుకున్నారు.

02/16/2016 - 03:06

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఆస్ట్రేలియాకు రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌పై 1-0 ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీ సాధించిన ఆడం వోగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది.

02/15/2016 - 03:02

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 14: శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి, మూడో టి-20లో అశ్విన్ తన బౌలింగ్ మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. భారత్‌కు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. పిచ్ స్వభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని లంక బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. అతనితోపాటు మిగతా బౌలర్లు కూడా రాణించి, ప్రత్యర్థి జట్టును కేవలం 82 పరుగులకే ఆలౌట్ చేశారు.

02/15/2016 - 02:55

మీర్పూర్, ఫిబ్రవరి 14: దారుణంగా విఫలమైన బ్యాట్స్‌మెన్ నిలువునా ముంచేయడంతో అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్‌లో భారత్ పరాజయాన్ని ఎదుర్కోగా, వెస్టిండీస్ మొట్టమొదటిసారి విజేతగా నిలిచింది. సర్ఫ్‌రాజ్ ఖాన్ (89 బంతుల్లో 51 పరుగులు) హాఫ్ సెంచరీ మినహా భారత బ్యాట్స్‌మెన్‌లో ఎవరూ చెప్పుకోదగ్గ స్థాయిలో రాణించలేకపోయారు. ఫలితంగా 45.1 ఓవర్లలో 145 పరుగులకే ఇండియా కుప్పకూలింది.

02/15/2016 - 02:55

గౌహతి, ఫిబ్రవరి 14: దక్షిణ ఆసియా గేమ్స్ (శాగ్)లో భారత్ దూకుడును కొనసాగిస్తున్నది. ఆదివారం నాటి పోటీలు ముగిసే సమయానికి 160 స్వర్ణం, 88 రజతం, 21 కాంస్యాలతో మొత్తం 275 పతకాలు సాధించి తనకు తిరుగులేని నిరూపించింది. శ్రీలంక 167 (25 స్వర్ణం, 56 రజతం, 85 కాంస్యం), పాకిస్తాన్ 81 (9 స్వర్ణం, 27 రజతం, 45 కాంస్యం) పతకాలతో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలను ఆక్రమించాయి.

02/15/2016 - 02:52

రాంచీ, ఫిబ్రవరి 14: కెప్టెన్ ఆష్లే జాక్సన్ కీలక గోల్ చేసి, దబాంగ్ ముంబయితో ఆదివారం జరిగిన హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో రాంచీ రేస్‌ను గెలిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ కొనసాగిన ఇరు జట్ల మితిమీరిన రక్షణాత్మక విధానం ప్రేక్షకులను అసహనానికి గురి చేసింది. 35వ నిమిషంలో జాక్సన్ గోల్ చేయడాన్ని మినహాయిస్తే, ఈ మ్యాచ్ ఏ దశలోనూ అభిమానులను ఆకట్టుకోలేకపోయింది.

02/15/2016 - 02:52

పుణే, ఫిబ్రవరి 14: ప్రో కబడ్డీలో ఆదివారం దాదాపు ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో బెంగాల్ వారియర్స్‌ను యుముంబా జట్టు 32-21 తేడాతో గెల్చుకుంది. రిషాంక్ దేవాదిగ 10 పాయింట్లతో రాణించాడు. జీవ కుమార్, ఫజల్ ట్రాచలీ చెరి నాలుగు పాయింట్లు చేశారు. బెంగాల్ తరఫున నితన్ తోమర్ ఆరు పాయింట్లతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. జంగ్ కున్ లీ నాలుగు, మహేష్ గౌడ్ మూడు చొప్పున పరుగులు చేశారు.

02/15/2016 - 02:45

హైదరాబాద్: స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫిట్నెస్ సమస్యతో బరిలోకి దిగని కారణంగా, సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్‌లో భారత మహిళా జట్టు గట్టి సవాళ్లను ఎదుర్కోనుంది.

Pages