S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/17/2016 - 08:02

షిల్లాంగ్: శ్రీలంక బాక్సింగ్ చరిత్రలో మొట్టమొదటిసారి ఒక అంతర్జాతీయ ఈవెంట్‌లో స్వర్ణ పతకాన్ని సాధించిపెట్టిన మహిళగా చరిత్ర పుటల్లో చోటు సంపాదించిన అనూష శాగ్ ఫైనల్‌లో పట్టుతప్పి కిందపడడంతో ఫైట్‌ను కొనసాగించలేక కన్నీళ్లపర్యంతమైంది. 2003 ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో విజేతగా నిలిచిన ఆమె టైటిల్‌పై ఆశపెట్టుకుంది.

02/17/2016 - 08:02

సావో పౌలో: బ్రెజిల్ ఫుట్‌బాల్ సూపర్ స్టార్ నేమార్ ఆస్తులను అధికారులు స్తంభింప చేశారు. వీటి మొత్తం 50 మిలియన్ డాలర్లు (సుమారు 342 కోట్ల రూపాయలు) వరకు ఉంటుంది. బ్రెజిల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం, బార్సిలోనాకు ప్రాతినిథ్యం వహిస్తున్న నేమార్ 2011-2013 మధ్యకాలంలో తప్పుడు లెక్కలు చూపి సుమారు 16 మిలియన్ డాలర్ల మేరకు పన్ను ఎగవేతకు పాల్పడినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు.

02/17/2016 - 08:01

ముంబయి: హాకీ ఇండియా లీగ్ (హెచ్‌ఐఎల్)లో మంగళవారం ఉత్తర ప్రదేశ్ (యుపి) విజార్డ్స్‌తో జరిగిన మ్యాచ్‌ని దబాంగ్ ముంబయి 6-3 తేడాతో గెల్చుకుంది. ముంబయి తరఫున ముగ్గురు ఆటగాళ్లు, గుర్జాత్ సింగ్ (13వ నిమిషం), ఫ్లోరియర్ ఫచ్స్ (42వ నిమిషం), అఫాన్ యూసుఫ్ (59వ నిమిషం) ఫీల్డ్ గోల్స్ సాధించడంతో ఆ జట్టుకు ఆరు గోల్స్ లభించాయి. యుపి ఆటగాళ్లలో రఘునాథ్ 19వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచాడు.

02/17/2016 - 08:00

ధర్మశాల: టి-20 ప్రపంచ కప్ చాంపియన్‌షిప్ పోటీల కోసం ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌పిసిఎ) మైదానం ముస్తాబవుతున్నది. చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ వచ్చేనెల 19న ఇదే వేదికపై జరగనుంది. మ్యాచ్‌లో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశాలున్నాయని హెచ్‌పిసిఎ చీఫ్ క్యూరేటర్ సునీల్ చౌహాన్ తెలిపాడు.

02/16/2016 - 03:17

సెయింట్ పీటర్స్‌బర్గ్, ఫిబ్రవరి 15: సాన్‌టినాగా గుర్తింపు పొందిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ప్రపంచ మాజీ నంబర్ వన్ మార్టినా హింగిస్ జోడీ తన జైత్రయాత్రను కొనసాగిస్తున్నది. ఇక్కడ జరిగిన సెయింట్ పీటర్స్‌బర్గ్ మహిళల టెన్నిస్ టోర్నమెంట్‌లో ఈ జోడీ టైటిల్ సాధించింది. ఫైనల్‌లో వీరు వెరా దెషెవినా, బార్బరా క్రెజికొవా జోడీని 6-3, 6-1 తేడాతో చిత్తుచేశారు. వీరికి ఇది వరుసగా 40వ విజయం కావడం విశేషం.

02/16/2016 - 03:13

జ్యూరిచ్, ఫిబ్రవరి 15: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న జ్యూరిచ్ చెస్ టోర్నమెంట్‌లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి రెండు గేమ్స్‌ను వరుసగా లెవన్ అరోనియన్, అనిష్ గిరిపై విజయాలను నమోదు చేసిన అతను మూడో రౌండ్‌లో అలెక్సీ షిరోవ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నాలుగో రౌండ్‌లో అమెరికా ఆటగాడు హికారూ నాకమూరతో తలపడి డ్రాతో సంతృప్తి చెందాడు.

02/16/2016 - 03:11

గౌహతి, ఫిబ్రవరి 15: షూటర్లు క్లీన్‌స్వీప్ సాధించిన నేపథ్యంలో దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. సోమవారం నాలుగు విభాగాల్లో పోటీలు జరగ్గా, అన్నింటిలోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఇండివిజువల్ ఈవెంట్‌లో శే్వతా సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 194.4 పాయింట్లు సంపాదించగా, 192.5 పాయింట్లతో హీనా సిద్ధు రజత పతకాన్ని అందుకుంది.

02/16/2016 - 03:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రానున్న ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారీ స్కోర్లు సాధించడమే తన లక్ష్యమని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఇప్పటి ఫామ్‌ను కొనసాగించగలననే నమ్మకం తనకు ఉందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. వౌలిక సూత్రాలను వీడకుండా క్రీజ్‌లో నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు సాధ్యమేనని అన్నాడు.

02/16/2016 - 03:09

షిల్లాంగ్, ఫిబ్రవరి 15: వివిధ స్థాయిల్లో పోటీలు లేకపోతే బాక్సర్ల భవిష్యత్తు చాలా కష్టతరంగా మారుతుందని భారత బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. బాక్సింగ్ ఇండియా (బిఐ)పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) గత ఏడాది నిషేధం విధించిన తర్వాత మన దశంలో బాక్సింగ్ కార్యకలాపాలు అడ్‌హాక్ కమిటీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

02/16/2016 - 03:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: లోధా కమిటీ చేసిన సిఫార్సులపై బిసిసిఐని ప్రశ్నిస్తే బాగుంటుందని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోనీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. సోమవారం ఇక్కడ జరిగిన పుణె జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీపై విలేఖరులు ప్రశ్నల వర్షం కురిపించారు.

Pages