S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/22/2016 - 04:26

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండవ, చివరి టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతున్నది. కెప్టెన్ స్టీవెన్ స్మిత్, జో బర్న్స్ శతకాలతో రాణించడంతో, మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా నాలుగు వికెట్లకు 363 పరుగులు చేసింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 370 పరుగులు చేయగా, ఏడు పరుగులు వెనుకంజలో ఉన్న ఆసీస్ చేతిలో ఇంకా ఆరు వికెట్లు ఉన్నాయి.

02/22/2016 - 04:25

హైదరాబాద్: గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న ఆసియా బాడ్మింటన్ టీం చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో చైనా టైటిల్ సాధించింది. ఫైనల్ పోరులో ఈ జట్టు 3-2 తేడాతో జపాన్‌ను ఓడించింది. ఆరంభంలో ఆధిపత్యాన్ని కనబరచిన జపాన్ ఆతర్వాత చైనా ధాటిని ఎదురునిలవలేకపోయింది. తొలి సింగిల్స్ మ్యాచ్‌లో షిజియాన్ వాంగ్‌ను ఒకుహరా నొజొమీ 17-21, 21-16, 21-15 తేడాతో ఓడించింది.

02/22/2016 - 04:24

కోల్‌కతా: రోహిత్ శర్మతో కలిసి తన ప్రయాణం సుదీర్ఘకాలం సాగుతుందని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ ధీమా వ్యక్తం చేశాడు.

02/22/2016 - 04:23

మాడ్రిడ్: స్పానిష్ సుకర్ చాంపియన్‌షిప్ లా లిగాలో బార్సిలోనా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. లాస్ పల్మాస్‌తో జరిగిన మ్యాచ్‌ని 2-1 తేడాతో గెల్చుకొని, పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఈ జట్టు ఖాతాలో మొత్తం 63 పాయింట్లు ఉండగా, రెండో స్థానంలో నిలిచిన అట్లెటికో మాడ్రిడ్ ఏకంగా తొమ్మిది పాయింట్లు వెనుకంజలో ఉంది. రియల్ మాడ్రిడ్ 53 పాయింట్లతో మూడో స్థానాన్ని ఆక్రమించింది.

02/21/2016 - 08:19

క్రైస్ట్‌చర్చి: న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ కెరీర్‌లో తన చివరి టెస్టును చిరస్మరణీయమైనదిగా మార్చుకున్నాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి, రెండో టెస్టు మ్యాచ్ మొదటి ఇన్నింగ్స్‌లో అతను కేవలం 54 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా శతకాన్ని చేసిన బ్యాట్స్‌మన్‌గా రికార్డు పుస్తకాల్లో చోటు సంపాదించాడు.

02/21/2016 - 08:20

న్యూఢిల్లీ: టెస్టు క్రికెట్ చరిత్రలో తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన బ్యాట్స్‌మన్‌గా న్యూజిలాండ్ కెప్టెన్ బ్రెండన్ మెక్‌కలమ్ నెలకొల్పిన రికార్డును భారతీయుడే బద్దలు కొడతాడని మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ సురేష్ రైనా జోస్యం చెప్పాడు. గుజరాత్ లయన్స్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న అతను మాట్లాడుతూ మెక్‌కలమ్ అద్వితీయ ప్రతిభావంతుడని, అతను రికార్డు నెలకొల్పడంలో వింత ఏమీ లేదని అన్నాడు.

02/21/2016 - 08:15

న్యూఢిల్లీ: ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ విభాగంలో మహేష్ భూపతి టైటిల్ సాధించాడు. యుకీ భంబ్రీతో కలిసి బరిలోకి దిగిన అతను ఫైనల్‌లో 6-3, 4-6, 10-5 తేడాతో సకేత్ మైనేని, సనమ్ సింగ్ జోడీని ఓడించాడు. మూడేళ్ల కాలంలో భూపతికి ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. కాగా, అందుకు ముందు పురుషుల సింగిల్స్ సెమీ ఫైనల్‌లో నెగ్గిన సాకేత్ ఫైనల్‌లో స్థానం సంపాదించాడు.

02/21/2016 - 08:15

రియో డి జెనీరియో: ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న డైవర్స్‌ను జికా భయం వెంటాడుతున్నది. 46 దేశాలకు చెందిన 217 మంది స్విమ్మర్లు ఇక్కడ జరుగుతున్న ఒలింపిక్ డైవింగ్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో పాల్గొంటున్నారు. దాదాపుగా అందరినీ జికా వైరస్ భయం వెంటాడుతున్నది. దోమ కాటువల్ల వ్యాపించే ఈ వైరస్ వల్ల విపరీత పరిణామాలు ఎదురవుతాయి.

02/21/2016 - 08:14

నైరోబీ: కెన్యాను రియో ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధించడం ఖాయంగా కనిపిస్తున్నది. దశాబ్దాల కాలంగా చాలా మంది అథ్లెట్లు నిషిద్ధ ఉత్ప్రేరకాలను వాడుతున్నట్టు ప్రపంచ డోపింగ్ నిరోధక విభాగం (వాడా) అధ్యయనంలో వెల్లడి కావడంతో అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్), అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఒసి) పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి.

02/21/2016 - 08:14

దుబాయ్: వెస్టిండీస్ ఆల్‌రౌండర్ కెవిన్ కూపర్ బౌలింగ్ యాక్షన్ అనుమానాస్పదంగా ఉందన్న ఫిర్యాదు అందినట్టు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రకటించింది. 27 ఏళ్ల కూపర్ వెస్టిండీస్ జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని సంపాదించుకోలేదు. అయితే, ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతను ట్రినిడాడ్ అండ్ డొబాగో తరఫున ఆడుతున్నాడు.

Pages