S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

02/16/2016 - 03:13

జ్యూరిచ్, ఫిబ్రవరి 15: ప్రపంచ మాజీ చాంపియన్, భారత గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ ఇక్కడ జరుగుతున్న జ్యూరిచ్ చెస్ టోర్నమెంట్‌లో ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. మొదటి రెండు గేమ్స్‌ను వరుసగా లెవన్ అరోనియన్, అనిష్ గిరిపై విజయాలను నమోదు చేసిన అతను మూడో రౌండ్‌లో అలెక్సీ షిరోవ్‌తో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. నాలుగో రౌండ్‌లో అమెరికా ఆటగాడు హికారూ నాకమూరతో తలపడి డ్రాతో సంతృప్తి చెందాడు.

02/16/2016 - 03:11

గౌహతి, ఫిబ్రవరి 15: షూటర్లు క్లీన్‌స్వీప్ సాధించిన నేపథ్యంలో దక్షిణ ఆసియా క్రీడల్లో భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నది. సోమవారం నాలుగు విభాగాల్లో పోటీలు జరగ్గా, అన్నింటిలోనూ భారత్‌కు స్వర్ణాలు లభించాయి. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఇండివిజువల్ ఈవెంట్‌లో శే్వతా సింగ్ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 194.4 పాయింట్లు సంపాదించగా, 192.5 పాయింట్లతో హీనా సిద్ధు రజత పతకాన్ని అందుకుంది.

02/16/2016 - 03:10

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: రానున్న ఆసియా కప్, టి-20 ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీల్లో భారీ స్కోర్లు సాధించడమే తన లక్ష్యమని భారత ఓపెనర్ శిఖర్ ధావన్ అన్నాడు. ఇప్పటి ఫామ్‌ను కొనసాగించగలననే నమ్మకం తనకు ఉందని పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పాడు. వౌలిక సూత్రాలను వీడకుండా క్రీజ్‌లో నిలదొక్కుకుంటే భారీ స్కోర్లు సాధ్యమేనని అన్నాడు.

02/16/2016 - 03:09

షిల్లాంగ్, ఫిబ్రవరి 15: వివిధ స్థాయిల్లో పోటీలు లేకపోతే బాక్సర్ల భవిష్యత్తు చాలా కష్టతరంగా మారుతుందని భారత బాక్సింగ్ స్టార్ మేరీ కోమ్ వ్యాఖ్యానించింది. బాక్సింగ్ ఇండియా (బిఐ)పై అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఎఐబిఎ) గత ఏడాది నిషేధం విధించిన తర్వాత మన దశంలో బాక్సింగ్ కార్యకలాపాలు అడ్‌హాక్ కమిటీ పర్యవేక్షణలో జరుగుతున్నాయి.

02/16/2016 - 03:08

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: లోధా కమిటీ చేసిన సిఫార్సులపై బిసిసిఐని ప్రశ్నిస్తే బాగుంటుందని భారత కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వ్యాఖ్యానించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో కొత్తగా అడుగుపెట్టిన రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు ధోనీ నాయకత్వం వహించనున్న విషయం తెలిసిందే. సోమవారం ఇక్కడ జరిగిన పుణె జట్టు లోగో ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ధోనీపై విలేఖరులు ప్రశ్నల వర్షం కురిపించారు.

02/16/2016 - 03:07

వడోదర, ఫిబ్రవరి 15: సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. సెమీ ఫైనల్‌లో ఈ జట్టు అస్సాంను 10 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ జయదేవ్ ఉనాద్కత్ 45 పరుగులకు ఐదు వికెట్లు పడగొట్టి, సౌరాష్ట్ర విజయంలో కీలక పాత్ర పోషించాడు. అస్సాం తొలి ఇన్నింగ్స్‌లో 234 పరుగులు చేయగా, అందుకు సమాధానంగా సౌరాష్ట్ర 353 పరుగులు చేసింది.

02/16/2016 - 03:07

రాంచీ, ఫిబ్రవరి 15: మహిళల క్రికెట్‌లో శ్రీలంకతో సోమవారం జరిగిన మ్యాచ్‌ని భారత జట్టు 107 పరుగుల భారీ ఆధిక్యంతో గెల్చుకొని, మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో బోణీ చేసింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్లకు 245 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ స్మృతి మందన (55), హర్‌మన్‌ప్రీత్ కౌర్ (50) అర్ధ శతకాలతో రాణించారు.

02/16/2016 - 03:06

కరాచీ, ఫిబ్రవరి 15: పాకిస్తాన్ క్రీడాకారులకు వాహెబ్ రియాజ్, అహ్మద్ షెజాద్‌లకు అధికారులు జరిమానా విధించారు. దుబాయ్‌లో పిఎస్‌ఎల్ టోర్నీలో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్, పెషావల్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతున్నప్పుడు వీరిద్దరూ పరస్పరం దూషించుకున్నారు. అంతటితో ఆగకుండా ఒకరినొకరు తోసుకున్నారు.

02/16/2016 - 03:06

వెల్లింగ్టన్, ఫిబ్రవరి 15: ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 52 పరుగుల భారీ తేడాతో చిత్తయింది. ఆస్ట్రేలియాకు రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌పై 1-0 ఆధిక్యం లభించింది. డబుల్ సెంచరీ సాధించిన ఆడం వోగ్స్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. న్యూజిలాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 183 పరుగులకే ఆలౌటైంది.

02/15/2016 - 03:02

విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 14: శ్రీలంకతో ఆదివారం జరిగిన చివరి, మూడో టి-20లో అశ్విన్ తన బౌలింగ్ మాయాజాలాన్ని మరోసారి ప్రదర్శించాడు. భారత్‌కు తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందించాడు. పిచ్ స్వభావాన్ని తమకు అనుకూలంగా మార్చుకొని లంక బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించాడు. అతనితోపాటు మిగతా బౌలర్లు కూడా రాణించి, ప్రత్యర్థి జట్టును కేవలం 82 పరుగులకే ఆలౌట్ చేశారు.

Pages