S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

03/28/2016 - 05:05

మొహాలీ, మార్చి 27: టి-20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లీ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడి, భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఆస్ట్రేలియా ఆరు వికెట్లకు 160 పరుగులు సాధించగా, అందుకు సమాధానంగా టీమిండియా మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఫైనల్‌లో స్థానం కోసం వెస్టిండీస్‌తో భారత్ తలపడుతుంది.

03/28/2016 - 05:08

నాగపూర్, మార్చి 27: ‘పసికూన జట్టు’ అఫ్గానిస్తాన్ టి-20 వరల్డ్ కప్ చివరి గ్రూప్ మ్యాచ్‌లో సంచలన విజయాన్ని నమోదు చేసింది. వరుసగా మూడు విజయాలతో గ్రూప్-1లో అగ్రస్థానాన్ని ఆక్రమించిన వెస్టిండీస్ దూకుడుకు కళ్లెం వేసింది. విజయగర్వంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. టాస్ గెలిచిన విండీస్ ఫీల్డింగ్ ఎంచుకోగా, తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 123 పరుగులు చేసింది.

03/28/2016 - 05:03

చెన్నై, మార్చి 27: మహిళల టి-20 వరల్డ్ కప్‌లో భాగంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్ లో పాకిస్తాన్‌పై ఇంగ్లాండ్ 68 పరుగుల తేడాతో గెలిచింది. చార్లొట్ ఎడ్వర్డ్స్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్‌ను విజయంలో కీలక పాత్ర పోషించింది. 149 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించ లేకపోయన పాకిస్తాన్ 17.5 ఓవర్లలో 80 పరుగులకే కుప్పకూలింది.

03/28/2016 - 05:01

మియామీ, మార్చి 27: ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ ఇక్కడ జరుగుతున్న మియామీ టెన్నిస్ టోర్నమెంట్ మహిళల సింగిల్స్ ప్రీ క్వార్టర్స్ చేరింది. మూడో రౌండ్‌లో ఆమె జరీనా దియాస్‌ను 7-5, 6-3 తేడాతో వరుస సెట్లలో ఓడించింది. మొదటి సెట్‌లో గట్టిపోటీనిచ్చిన దియాస్ రెండో సెట్‌లో చేతులెత్తేసింది. కాగా, తర్వాతి రౌండ్‌లో స్వెత్లానా కుజ్నెత్సొవాను సెరెనా ఢీ కొంటుంది.

03/28/2016 - 05:00

మొహాలీ, మార్చి 27: దియేంద్ర డోటిన్ ఆల్‌రౌండ్ ప్రతిభ మహిళల టి-20 వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్‌లో భారత్‌పై వెస్టిండీస్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. కెప్టెన్ స్ట్ఫోనీ టేలర్ 45 బంతుల్లో 47, డోటిన్ 40 బంతుల్లో 45 చొప్పున పరుగులు చేసి, విండీస్‌ను ఆదుకున్నారు.

03/27/2016 - 18:55

నాగపూర్:టి-20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన ఆఫ్గానిస్తాన్ జట్టు వరుస విజయాలతో గట్టి జట్టుగా పేరొందిన వెస్టిండీస్‌పై అద్భుత విజయం సాధించింది. ఈ టోర్నీలో గ్రూప్ 1లో ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌లలో ఘన విజయాలు సాధించిన వెస్టిండీస్ ఇవాళ నాగపూర్‌లో ఆఫ్గానిస్తాన్ చేతిలో ఓడిపోవడం సంచలనం కలిగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్గానిస్తాన్ జట్టు ఏడు వికెట్లు కోల్పోయి 123 పరుగులు మాత్రమే చేయగలిగింది.

03/27/2016 - 05:37

ఆస్ట్రేలియాతో ఆడిన గత ఐదు టి-20 ఇంటర్నేల్ మ్యాచ్‌ల్లో భారత్ విజయాలను నమోదు చేసింది. ఆదివారం రాత్రి 7.30 గంటలకు మొదలయ్యే మ్యాచ్‌లో మరోసారి విజయభేరి మోగించి, తన ఆధిక్యాన్ని నిలబెట్టుకుంటుందా లేదా అన్నది చూడాలి.

03/27/2016 - 05:35

నాగపూర్, మార్చి 26: మూడు వరుస విజయాలతో ఇప్పటికే టి-20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరిన వెస్టిండీస్, వరుస పరాజయాలతో టోర్నీ నుంచి నిష్క్రమిస్తున్న అఫ్గానిస్తాన్ జట్ల మధ్య ఆదివారం ఎలాంటి ప్రాధాన్యం లేని మ్యాచ్ జరగనుంది. అయితే, కనీసం ఒక మ్యాచ్‌ని గెల్చుకోవాలన్న పట్టుదలతో అఫ్గాన్ ఆడనుంది. విండీస్ కూడా విజయంపై కనే్నసింది.

03/27/2016 - 05:34

కోల్‌కతా, మార్చి 26: టి-20 వరల్డ్ కప్ పోటీల్లో ‘అండర్ డాగ్’ ముద్ర వేయించుకొని బరిలోకి దిగిన న్యూజిలాండ్ గ్రూప్ దశలో శనివారం బంగ్లాదేశ్‌ను 75 పరుగుల తేడాతో చిత్తుచేసింది. లీగ్ స్థాయిలో నాలుగు మ్యాచ్‌లను గెల్చుకొని క్లీన్‌స్వీప్ చేసింది. 146 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు చేసిన ప్రయత్నంలో విఫలమైన బంగ్లాదేశ్ టి-20 ఇంటర్నేషనల్స్‌లో ఎనిమిదో అత్యల్ప స్కోరును నమోదు చేసింది.

03/27/2016 - 05:34

న్యూఢిల్లీ, మార్చి 26: శ్రీలంక, ఇంగ్లాండ్ జట్ల మ ధ్య శనివారం జరిగిన గ్రూప్ మ్యాచ్ చివరి క్షణం వ రకూ ఉత్కంఠ రేపింది. ఓటమి ఖాయంగా కనిపిం చిన లంక ఒకానొక దశలో విజయంపై అభిమాను ల్లో ఆశలు రేపింది. కానీ, లక్ష్యానికి పది పరుగుల దూరంలో నిలిచిపోయంది. కెప్టెన్ ఏంజెలో మా థ్యూస్ చేసిన ఒంటరి పోరాటం ఫలించలేదు. ఇం గ్లాండ్ విజయభేరి మోగించి, టి-20 వరల్డ్ కప్ సె మీ ఫైనల్‌లో స్థానంసంపాదించుకుంది

Pages