S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

04/20/2016 - 05:11

న్యూఢిల్లీ, ఏప్రిల్ 19: లోధా కమిటీ సూచించిన విధంగా ఒక రాష్ట్రానికి ఒకే ఓటు అన్న విధానాన్ని అమలుచేస్తే సమస్యలు మరింతగా పెరుగుతాయే తప్ప తగ్గవని సుప్రీం కోర్టుకు భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) స్పష్టం చేసింది. లోధా కమిటీ చేసిన సిఫార్సులను యథాతథంగా అమలు చేయాల్సిందిగా ఇది వరకే బిసిసిఐకి సుప్రీం కోర్టు సూచించిన విషయం తెలిసిందే.

04/20/2016 - 05:09

రియో డి జెనీరో, ఏప్రిల్ 19: ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించడమే తన లక్ష్యమని భారత మహిళా జిమ్నాస్ట్ దీప కర్మాకర్ చెప్పింది. ఇక్కడ జరిగిన క్వాలిఫయింగ్ ఈవెంట్‌లో 52.698 పాయింట్లు సాధించి, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భారత మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీప పిటిఐతో మాట్లాడుతూ ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ విభాగంలో పోటీపడనున్నట్టు చెప్పింది.

04/20/2016 - 05:07

చెన్నై, ఏప్రిల్ 19: భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) అధ్యక్షుడు శశాంక్ మనోహర్ తీసుకున్న నిర్ణయం కారణంగా బోర్డుకు సుమారు 1,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లనున్నదని, కాబట్టి ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా ఆదేశించాలని కోరుతో మద్రాసు హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైంది.

04/20/2016 - 05:07

మొహాలీ, ఏప్రిల్ 19: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆరు వికెట్ల తేడాతో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌పై విజయభేరి మోగించింది. పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 138 పరుగులు చేయగా, నైట్ రైడర్స్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే, నాలుగు వికెట్లకు 141 పరుగులు సాధించింది. ఓపెనర్ రాబిన్ ఉతప్ప 28 బంతుల్లోనే 54 పరుగులు చేసి నైట్ రైడర్స్ విజయానికి బాటలు వేశాడు.

04/19/2016 - 06:48

ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించిన తొలి భజిమ్నాస్ట్ దీప క్వాలిఫైరత మహిళా జిమ్నాస్ట్‌గా చరిత్ర సృష్టించిన దీప కర్మాకర్‌పై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. యావత్ భారత దేశం గర్వించేలా దీప అసాధారణ ప్రతిభ కనబరచిందని కేంద్ర క్రీడాశాఖ మంత్రి శర్వానంద సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దీప ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడాన్ని ఆయన ఒక చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.

04/19/2016 - 06:16

మొహాలీ, ఏప్రిల్ 18: తాజా ఐపిఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తొలి విజయాన్ని నమోదు చేసింది. ఇంతకు ముందు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిన ఈ జట్టు హోంగ్రౌండ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రతిభ కనబరచింది. ముంబయితో మొదట బ్యాటింగ్ చేయించి, ఆరు వికెట్ల నష్టానికి 142 పరుగులకు కట్టడి చేసింది. బరీందర్ శరణ్ మూడు వికెట్లు పడగొట్టి ముంబయిని గట్టిదెబ్బ తీశాడు.

04/18/2016 - 06:54

మొహాలీ, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ ఎట్టకేలకు బోణీ చేసింది. ప్రస్తుత సీజన్‌లో ఇంతకుముందు వరుసగా రెండు పరాజయాలను ఎదుర్కొని పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఆ జట్టు ఆదివారం మొహాలీలోని సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి తొలి విజయాన్ని నమోదు చేసుకుంది.

04/18/2016 - 06:49

బెంగళూరు, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్ తొమ్మిదో ఎడిషన్ ట్వంటీ-20 క్రికెట్ టోర్నీలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ సత్తా చాటుకుంది. శనివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరును సొంత మైదానంలో మట్టికరిపించి ఈ సీజన్‌లో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.

04/18/2016 - 06:47

మాంటే కార్లో, ఏప్రిల్ 17: మాంటే-కార్లో మాస్టర్స్ ఎటిపి టెన్నిస్ టోర్నమెంట్‌లో మాజీ చాంపియన్, ‘స్పెయిన్ బుల్’ రాఫెల్ నాదల్ టైటిల్ విజేతగా నిలిచాడు. ఈ టోర్నీలో రెండో సీడ్‌గా బరిలోకి దిగిన నాదల్ ఆదివారం ఇక్కడ జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌కు చెందిన 13వ సీడ్ ఆటగాడు గేల్ మోన్‌ఫిల్స్‌పై చెమటోడ్చి విజయం సాధించాడు.

04/18/2016 - 06:47

కొలంబో, ఏప్రిల్ 17: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ముంబయి ఇండియన్స్ తరఫున ఆడుతున్న శ్రీలంక ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగకు ఆ దేశ క్రికెట్ బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసింది. మలింగ వైద్య పరమైన అనుమతి పొందకుండా బోర్డు ఆదేశాన్ని ధిక్కరించి ఐపిఎల్‌లో ఆడుతుండటమే ఇందుకు కారణం. ఈ విషయపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేస్తూ మలింగకు బోర్డు షోకాజ్ నోటీసు జారీ చేసిందని శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) వర్గాలు ధ్రువీకరించాయి.

Pages