S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్రీడాభూమి

05/03/2016 - 03:21

రాజ్‌కోట్, మే 2: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో భాగంగా ఆదివారం నాటి మ్యాచ్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైన గుజరాత్ లయన్స్ మంగళవారం హోం గ్రౌండ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ను ఎదుర్కోవడానికి సిద్ధమైంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్న గుజరాత్ లయన్స్ జట్టుకు డేర్‌డెవిల్స్ నుంచి గట్టిపోటీ తప్పక పోవచ్చని విశే్లషకుల అభిప్రాయం.

05/03/2016 - 03:19

పుణె, మే 2: మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలోని రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్‌కు మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ గాయం కారణంగా ఐపిఎల్‌కు దూరమయ్యాడు. ఇప్పటికే కెవిన్ పీటర్సన్, ఫఫ్ డు ప్లెసిస్, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ సేవలను పుణె కోల్పోయింది. స్మిత్ ఇప్పుడు ఆ జాబితాలో చేరాడు.

05/03/2016 - 03:16

పుణె, మే 2: ముంబయి ఇండియన్స్ తరఫున ఐపిఎల్‌లో ఆడుతున్న తెలుగు వీరుడు అంబటి రాయుడుపై అదే జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న భారత సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోపంతో అతనిని దూషించాడు. అయితే, రాయుడు కూడా వెనక్కు తగ్గకుండా మాటకు మాట సమాధానం చెప్పాడు. దీనితో కంగుతిన్న భజ్జీకి శాంతించక తప్పలేదు.

05/03/2016 - 03:14

రాజ్‌కోట్, మే 2: అంపైర్ నిర్ణయంపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన గుజరాత్ లయన్స్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను మ్యాచ్ రిఫరీ ఎం. నయ్యర్ మందలించాడు. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 23 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మ్యాచ్ జరుగుతున్నప్పుడు అంపైర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జడేజా నిరసన ధోరణిని ప్రదర్శించాడు.

05/03/2016 - 03:14

వెల్లింగ్టన్, మే 2: వెస్టిండీస్ మాజీ క్రికెటర్ ఫ్రాంక్లిన్ రోజ్‌ను న్యూజిలాండ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు గెంటేశారు. అనుమతించిన కాలం పూర్తయినప్పటికీ, అనధికారికంగా న్యూజిలాండ్‌లో ఉంటున్న అతనిపై కేసు నడిచింది. ఐదు వారాల శిక్షను అనుభవించి జైలు నుంచి బయటకు వచ్చిన వెంటనే అధికారులు అతనిని జమైకా విమానం ఎక్కించారు.

05/03/2016 - 03:13

మాడ్రిడ్, మే 2: స్పానిష్ సాకర్ లీగ్ లా లిగాలో బార్సిలోనా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. తాజా మ్యాచ్‌లో ఆ జట్టు రియల్ బెటిస్‌ను 2-0 తేడాతో ఓడించింది. ఇవాన్ రకిటిక్, లూయిస్ సౌరెజ్ చెరొక గోల్ చేసి బార్సిలోనాను గెలిపించారు. మరో మ్యాచ్‌లో అట్లెటికో మాడ్రిడ్ 1-0 తేడాతో రయో వలెకానోపై గెలిచింది. ఆంటోనీ గ్రీజ్మన్ కీలకమైన గోల్ చేసి అట్లెటికోకు విజయాన్ని సాధించిపెట్టాడు.

05/03/2016 - 03:11

మాడ్రిడ్, మే 2: ఫ్రెంచ్ ఓపెన్‌కు సన్నాహక ఈవెంట్‌గా పేర్కొనే మాడ్రిడ్ ఓపెన్ నుంచి టాప్ సీడ్ అగ్నీస్కా రద్వాన్‌స్కా అనూహ్యంగా తొలి రౌండ్‌లోనే ఓటమిపాలై నిష్క్రమించింది. ప్రపంచ నంబర్ వన్ సెరెనా విలియమ్స్ చివరి క్షణంలో వైదొలగడంతో, టాప్ సీడింగ్ పోలాంగ్‌కు చెందిన రద్వాన్‌స్కాకు దక్కింది. టైటిల్ సాధించే అవకాశాలు ఆమెకే ఎక్కువగా ఉన్నాయని క్రీడాపండితులు జోస్యం చెప్పారు.

05/02/2016 - 07:14

లండన్, మే 1: భారత ప్రొఫెషనల్ బాక్సర్ విజేందర్ సింగ్ ఖాతాలో మరో నాకౌట్ విజయం చేరింది. ఫ్రెంచ్ బాక్సర్ మతియోజ్ రోయర్‌తో జరిగిన ఫైట్‌ను అతను టెక్నికల్ నాకౌట్‌లో ఓడించాడు. ప్రొఫెషనల్ బాక్సర్‌గా మారిన తర్వాత విజేందర్‌కు ఇది వరుసగా ఐదో విజయం. ఆరు రౌండ్ల సూపర్ మిడిల్‌వెయిట్ విభాగంలో రోయర్‌తో తలపడిన 30 ఏళ్ల విజేందర్‌ను ఐదో రౌండ్‌లోనే రిఫరీ విజేతగా ప్రకటించాడు.

05/02/2016 - 07:11

రాజ్‌కోట్, మే 1: స్పిన్నర్ అక్షర్ పటేల్ అద్భుత ప్రతిభ గుజరాత్ లాయన్స్‌పై కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కు విజయాన్ని సాధించిపెట్టింది. కెప్టెన్ మురళీ విజయ్ అర్ధ శతకంతో పంజాబ్‌ను ఆదుకోగా, గుజరాత్ తరఫున జేమ్స్ ఫాల్క్‌నెర్ ఒంటరి పోరాటం సాగించినా ఫలితం లేకపోయింది. అంతకు ముందు గుజరాత్ ‘మిస్టీరియస్ స్పిన్నర్’ శివిల్ కౌశిక్ 3 వికెట్లు పడగొట్టి పంజాబ్‌ను కట్టడి చేసినప్పటికీ ఫలితం లేకపోయింది.

05/02/2016 - 07:10

హైదరాబాద్, మే 1: తమ జట్టు సమతూకంగా ఉందని, అన్ని విభాగాల్లోనూ రాణించగలుగుతున్నామని సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ అన్నాడు. శనివారం రాత్రి వర్షం కారణంగా ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్‌లో బలమైన ప్రత్యర్థి రాయల్ చాలెంజర్స్ బెంగళూరును 15 పరుగుల తేడాతో ఓడించడంతో ఆత్మవిశ్వాసం మరింత పెరిగిందని అన్నాడు.

Pages