S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంపాదకీయం

06/09/2016 - 05:35

రెండేళ్ల కాలవ్యవధిలో మన ప్రధాని నరేంద్రమోదీ అమెరికాకు నాలుగుసార్లు ద్వైపాక్షిక అధికార యాత్ర జరపడం ఉభయదేశాల మధ్య పెరుగుతున్న మైత్రికి ప్రబల నిదర్శనం. ప్రధానమంత్రి పదవీ బాధ్యతను స్వీకరించిన తరువాత 2014, సెప్టెంబర్‌లోమోదీ మొదటిసారి అమెరికాకు వెళ్లివచ్చారు. ఇప్పుడు, జూన్ ఏడవ దేదీన నాలుగవసారి అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ఒబామాను నాలుగవసారి కలుసుకున్నారు.

06/08/2016 - 03:51

వాయుకాలుష్యం వల్ల మానవుల ఆయుర్దాయం తగ్గిపోతోందన్నది మరోసారి జరిగిన ధ్రువీకరణ. కానీ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి అనుసరించవలసిన పద్ధతులు ఏవన్నది మాత్రం స్పష్టం కావడంలేదు. శాస్తజ్ఞ్రుల నిర్ధారణలో స్పష్టత లేదు, ప్రభుత్వాల విధానాలలో స్పష్టతలేదు. కాలుష్యం వల్ల ప్రాణాపాయం కలుగవచ్చునన్నది సామాన్య పరిజ్ఞానం. దీన్ని కనిపెట్టడానికి పరిశోధనలు అక్కరలేదు.

06/07/2016 - 00:49

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అఫ్గానిస్తాన్, ఖతార్ దేశాలలో జరిపిన పర్యటన వ్యూహాత్మక సహకారం విస్తృతికి నిదర్శనం. భారత అఫ్గానిస్తాన్ సంబంధాలలో మైత్రి, ముభావం వంతుల వారీగా దోబూచులాడం 2002 నుండి నడుస్తున్న చరిత్ర. తాలిబన్, అల్‌ఖాయిదాల బీభత్స పాలన నుండి విముక్తి అయిన అఫ్గానిస్తాన్ పునర్నిర్మాణం కోసం మనదేశం చిత్తశుద్ధితో కృషి చేస్తుండడం సడలని మన మైత్రీ విధానానికి నిదర్శనం.

06/06/2016 - 05:37

మన స్థూల జాతీయోత్పత్తి సాలీనా సగటున ఎనిమిది శాతం పెరగడానికి రంగం సిద్ధం కావడం ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న పరిణామం. గత ఆర్థిక సంవత్సరం -2015-16- చివరి మూడు నెలల్లో ఈ ఉత్పత్తి దాదాపు ఎనిమిది శాతం ప్రగతిని సాధించిందట. మొత్తం మీద గత సంవత్సరం ఏడున్నరశాతానికి పైగా స్థూల జాతీయ ఉత్పత్తులు పెరిగిపోవడం ప్రపంచంలోని మరేదేశంలోను సంభవించని అద్భుతం.

06/04/2016 - 06:29

పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి తరిమివేతకు గురి అయిన హిందువులకు మనదేశం పౌరసత్వం కల్పించడానికి వీలైన నిబంధనలను రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం పూనుకొనడం మానవీయతకు నిదర్శనం. ఆలస్యంగానైనా మన విధానంలో విజ్ఞత వికసిస్తున్నందుకు సర్వమత సమభావ వ్యవస్థను సమర్థించే వారందరూ హర్షించగలరు.

06/03/2016 - 04:04

రక్షణ విభాగానికి చెందిన స్థావరాలకే అగ్ని బీభత్సం నుండి రక్షణ లేకపోవడం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి మాయని మచ్చ. మహారాష్ట్ర వార్థా జిల్లా ఫూల్‌గావ్ పట్టణంలో నెలకొని ఉన్న సైనిక దళాల కేంద్ర ఆయుధ స్థావరం-సెంట్రల్ ఆమ్యునేషన్ డిపోలో మంగళవారం సంభవించిన భయంకర వహ్ని విలయం ఈ రక్షణలేని తనానికి మరో ఉదాహరణ.

06/02/2016 - 05:49

భారతదేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవతరించి సరిగ్గా రెండేళ్లు గడిచిపోయాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోతే ఏదో అయిపోతుందనే అనుమానాలు కనుమరుగయ్యాయి. పోరాడి సాధించి తెచ్చుకున్న తెలంగాణ ఒక్కో రంగంలో పురోగామిగా ముందుకు వెళ్తోంది. ఒక్కో సమస్యను సామరస్యంగా పరిష్కరించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తూ మూడో సంవత్సరంలోకి ప్రవేశించింది.

05/31/2016 - 23:52

భూమాతను ఆకుపచ్చని హారంతో అలంకరించాలన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పం హర్షణీయం. గత ఏడాది వర్షఋతువులో కోట్ల మొక్కలు నాటిన ప్రభుత్వం ఈ ఏడాది కూడ హరిత హారాన్ని మరిం త విస్తరించడానికి పూనుకుంటోంది. కాని రాష్ట్ర రాజధాని నగరంలో ఆకుపచ్చదనం నానాటికీ తగ్గిపోతుండడం దశాబ్దుల వైపరీత్యం. ఈ హరిత హననం తెలంగాణ ప్రభుత్వానికి సంక్రమించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నాటి వారసత్వం కావచ్చు.

05/31/2016 - 00:02

తమిళనాడులోని రెండు శాసనసభా నియోజకవర్గాల ఎన్నికల కార్యక్రమం రద్దయిపోవడం నల్లడబ్బు గురించి నకిలీ డబ్బు గురించి మరోసారి ధ్యాస పెరగడానికి విచిత్రమైన నేపథ్యం. నల్లడబ్బు నకిలీ డబ్బు విచ్చలవిడిగా చెలామణి అవుతుండడం తమిళనాడు శాసనసభ ఎన్నికల ప్రచారం మాధ్యమంగా మరోసారి ధ్రువపడింది. కాని తమిళనాట నల్లడబ్బు వికృత తాండవం చేయడం ప్రతీక మాత్రమే.

05/30/2016 - 05:07

సమాఖ్య కూటమి-ఫెడరల్ ఫ్రంట్- గురించి ప్రాంతీయ రాజకీయ అధినేతలకు మరోసారి స్ఫురించడం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల వల్ల సంభవించిన ప్రధాన పరిణామం. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌కు లభించిన ఘనవిజయం పశ్చిమ బెంగాల్ చరిత్రలోనే అపూర్వమైంది. అందువల్ల సమాఖ్య కూటమి ప్రతిపాదన మరోసారి ప్రాణం పోసుకునే అవకాశం లేకపోలేదు.

Pages