రాష్ట్రీయం

నీటి తీరువా పెంపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 23: ఇరవై సంవత్సరాల తర్వాత నీటి తీరువాను పెంచాలనే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు నీటి తీరువాను ఏమేరకు పెంచాలో ప్రతిపాదనలు సిద్ధమై ఆర్థిక శాఖకు చేరాయి. భారీ, మధ్యతరహా సాగునీటి ప్రాజెక్టుల కింద ఉండే ఆయకట్టు రైతుల నుంచి నీటి తీరువాను ప్రభుత్వం వసూలు చేస్తోంది. గతంలో 1996లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం నీటి తీరువాను పెంచింది. అప్పటి నుంచి ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా నీటి తీరువాను పెంచలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక లోటును పూడ్చుకోవడంలో భాగంగా నీటి తీరువాను పెంచే విషయమై దృష్టి సారించినట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. నీటి తీరువాలో రెండు కేటగిరీలు ఉన్నాయి. ఆయకట్టు కింద తొలి లేదా తడి పంటకు ప్రస్తుతం వసూలు చేస్తున్న రెండు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలకు తీరువాను పెంచనున్నారు. ఇందులోనే రెండవ కేటగిరీలో వందనుంచి రెండు వందల రూపాయలకు, రెండు, మూడు పంటలు వేసే చోట ఒకటవ కేటగిరీలో 150 రూపాయల నుంచి 300 రూపాయలకు, కేటగిరీ రెండులో వంద నుంచి రెండు వందల రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. ఆరుతడి పంట లేదా తొలి పంటలో ఒకటవ కేటగిరీలో వంద నుంచి రెండు వందల రూపాయలకు, రెండవ కేటగిరీలో 60 నుంచి 120 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. ఒకటవ కేటగిరీలో ఫసలీ ఇయర్ పంటకు 350 నుంచి 700 రూపాయలకు, రెండవ కేటగిరీలో 350 నుంచి 700 రూపాయలకు పెంచాలని ప్రతిపాదించారు. రొయ్యల సాగుకు సంబంధించి ఒకటవ కేటగిరీలో ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు, రెండవ కేటగిరీలోకూడా ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకు నీటి తీరువాను పెంచాలని ప్రతిపాదించారు. భారీ, మధ్య తరహా సాగునీటి వనరుల కింద ఒకటవ కేటగిరీ, ప్రభుత్వ ఇరిగేషన్ వనరులకింద సాలీనా ఐదు నెలల కంటే ఎక్కువ నీటి సరఫరా జరిగే భూములు రెండవ కేటగిరీ కిందకు వస్తాయి.
ప్రస్తుతం నీటి తీరువా ద్వారా రాష్ట్ర ఖజనాకు సాలీనా రూ.86 కోట్ల ఆదాయం వస్తోంది. పెంచిన నీటి తీరువా చార్జీలు అమలులోకి వస్తే సాలీనా రూ.640 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. ప్రాజెక్టుల కింద రైతులకు సాగునీటిని సరఫరా చేస్తున్నందున నిర్వహణ వ్యయాన్ని నీటి తీరువా రూపంలో ప్రభుత్వం రాబడుతుంది.