పడిలేచిన కెరటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మోహన్‌బాబు @ 40’లో దాసరి
విలక్షణ నటుడిగా తెలుగు తెరపై విభిన్న పాత్రల్లో మెప్పించి, నటుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోగా, విలన్‌గా, నిర్మాతగా, విద్యావేత్తగా పలు పాత్రలు పోషించి మనిషి తలుచుకుంటే ఎదగడం ఎలా ఉంటుందో చూపించిన వ్యక్తి నటుడు మోహన్‌బాబు. ఆయన సినీ జీవితం ప్రారంభమై నేటితో 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో మోహన్‌బాబు ఎట్ 40 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా దాసరి నారాయణరావు, టి.సుబ్బిరామిరెడ్డి, వెంకటేష్, మంచు విష్ణు, మనోజ్, మంచు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మాట్లాడుతూ ‘నా జీవితంలో ఎన్నో ఫంక్షన్స్ చూశాను కానీ ఇది ప్రత్యేకమే అని చెప్పాలి. ‘స్వర్గం నరకం’ సినిమా విడుదలై నేటితో 40 ఏళ్లు పూర్తయింది. సరిగ్గా ఈ సమయంలో ఈ కార్యక్రమం జరపడం ఆనందించదగ్గ విషయం. మోహన్‌బాబు నా ఇంటికి పెద్దబిడ్డ. ఈరోజు ఆయన సంపూర్ణమైన కుటుంబాన్ని చూస్తున్నాను. నటుడిని పరిచయం చేయడం, అతడు పెద్దవాడిగా ఎదగడం, 40 ఏళ్లు పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపుని తెచ్చుకుని సంపూర్ణ నటుడిగా ఈరోజు నిలబడ్డాడు. నేను అతన్ని పరిచయం చేసినా ఇన్నాళ్లు నాతో కలిసి ఉన్నారు. మోహన్‌బాబుకున్న కెరీర్‌గ్రాఫ్ ఇండియన్ సినిమా చరిత్రలో ఏ నటుడికీ లేదు. అమితాబ్, ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లాంటి నటులకు కూడా ఇలాంటి గ్రాఫ్ లేదు. అతడు ఎన్నోసార్లు పడి లేచాడు. నటుడిగా చేస్తూనే మరోవైపు నిర్మాతగా ఎన్నో చిత్రాల్ని నిర్మించాడు. ఒక దర్శకుడిగా అతనిలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. ఆయన కెరీర్‌లో ఆణిముత్యాలుగా నిలిచిన సినిమాలెన్నో ఉన్నాయి. పెదరాయడు సినిమా చరిత్ర సృష్టించింది. రాయలసీమ రామన్న చౌదరి సినిమా కూడా అద్భుతంగా ఉంటుంది. తెలుగు చిత్ర సీమలో వంద శాతం నటనను ఇవ్వగల వ్యక్తులు కొందరే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు మోహన్‌బాబు. ఆయన పిల్లల్ని కూడా ఈరోజు ఒక స్థాయిలో నిలబెట్టాడు. తప్పకుండా మోహన్‌బాబుతో చరిత్ర సృష్టించే సినిమా తీస్తా. ఆయన 50వ సంవత్సరం వేడుక ఇంతకంటే గొప్పగా జరుపుకోవాలని కోరుకుంటున్నానన్నారు. సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ మోహన్‌బాబు ఇలా ఆత్మీయులతో ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం ఆనందంగా వుంది. ఒక పరిపక్వత చెందిన మనిషి ఆయన. పరిపూర్ణమైన వ్యక్తి అని చెప్పాలి. తనని ప్రోత్సహించిన వారిని మరిచిపోకుండా వారికి కృతజ్ఞతగా ఉండడం ఆయనకే చెల్లింది. విలన్ నుంచి హీరోగా మళ్లీ హీరోనుంచి విలన్‌గా మారిన నటుడు ఆయన. అలాగే తండ్రిగా తన పిల్లల్ని ఉన్నత స్థితిలో నిలబెట్టిన వ్యక్తి. ఆయనకు డేరింగ్ ఎక్కువ. మోహన్‌బాబు తన కెరీర్‌లో ఎన్టీఆర్ చేసిన రావణబ్రహ్మ లాంటి పాత్ర చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు. మోహన్‌బాబు మాట్లాడుతూ ‘40 సంవత్సరాలు ఎలా గడిచిందో తెలియదు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి మూడు ఎకరాల పొలంవున్న ఓ టీచర్ కొడుకుని. ఏదో ఉద్యోగం చేసుకోవాలనే ఆలోచన కంటే సినిమాల్లోకెళ్లాలి అనే ఆలోచనతో చెన్నయ్‌కి బయలుదేరాను. అక్కడ ప్రభాకర్‌రెడ్డి, త్యాగరాజుల పరిచయంతో దాసరి నారాయణరావుగారితో పరిచయం ఏర్పడింది. స్వర్గం-నరకం సినిమాతో ఆయన నాకు సినీ జీవితాన్ని ప్రసాదించారు. సినిమా ప్రయత్నాలకోసం ఎన్నో కష్టాలు పడ్డాను.నా తండ్రి లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు. ఆయన ప్రోత్సాహంతో నటుడిగా ఎదిగిన నేను ఈరోజు తెలుగు ప్రేక్షకులు అభిమానించే స్థాయికి ఎదిగాను. నాకు సహకారం అందించిన నా దర్శకులకు, నిర్మాతలకు, టెక్నీషియన్లకు, ప్రేక్షకులకు రుణపడి ఉంటాను‘ అని అన్నారు.