పక్కాప్లాన్‌తో హారర్ చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ వేంకటేశ్వర సినీ పిక్చర్స్ పతాకంపై నాగేష్.సిహెచ్. నిర్మాతగా బేబి దివ్యప్రియ సమర్పణలో ఎ.వి.్ఫణిశ్వర్ (తుఫాన్) దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘పక్కా ప్లాన్’. సుభాష్, నాగేష్, భవానీ, యువరాణి ప్రధాన పాత్రల్లో నటిస్తన్న ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈ రోజు ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రసన్నకుమార్, తుమ్మలపల్లి రామసత్యనారాయణ చేతుల మీదుగా టీజర్ ఆవిష్కరణ జరిగింది. అనంతరం ప్రసన్నకుమార్ మాట్లాడుతూ, హారర్ చిత్రాలు ప్రస్తుతం బాగా ఆడుతున్నాయని, ఈ తరుణంలో పక్కాప్లాన్ లాంటి మంచి టైటిల్‌తో హారర్ చిత్రాన్ని నిర్మించడం మంచి ప్లాన్ అని, టైటిల్ లాగే టీజర్ కూడా చాలా డిఫరెంట్‌గా వుందని, కొత్తవారైనా కంటెంట్ వుంటే చాలు, సినిమా హిట్ చేయవచ్చని ఇటీవల చాలా చిత్రాలు నిరూపించాయని అన్నారు. ఆలాగే ఓ కొత్త టీమ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఫలించాలని కోరుకుంటున్నా అన్నారు. తమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ, టైటిల్, టీజర్ రెండూ కూడా చాలా క్యూరియాసిటీ కలిగిస్తున్నాయని, ప్రేమ్ సమకూర్చిన నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా వుంది. టీజర్‌లోనే దర్శకుడి ప్రతిభ ఏంటో తెలిసిపోతుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అని చెప్పారు.
ఓ కొత్త పాయింట్‌తో హారర్ సస్పెన్స్ థ్రిల్లిర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో అందరూ కొత్తవారైనా చక్కగా నటించారని దర్శకుడు ఫణీశ్వర్ అన్నారు. త్వరలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాను విడుదల చేసి సన్నాహాలు చేస్తున్నామని హీరో నాగేశ్.సిహెచ్. తెలిపారు. కార్యక్రమంలో ఎ.ఎస్.రావు, సుభాష్, నాగరూప తదితరులు పాల్గొన్నారు. బస్‌రాజ్, భవాని, యువరాజ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ప్రేమ్.ఎల్.ఎమ్., కెమెరా:లక్కీ, ఎడిటింగ్:సర్తాజ్,