Others

దానం ధర్మమే.. (నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్ని బ్రదర్స్ పతాకంపై అంజలీదేవి అద్భుతంగా రూపొందించిన అలనాటి చిత్రం -సతీసుమతి. కథానాయికగా అంజలీదేవే నటించి మెప్పించారు. సంగీత దర్శకుడు ఆదినారాయణరావు చేసిన బాణీలన్నీ అద్భుతాలే. సీనియర్ సముద్రాల రచించిన వేదాల నీతిసారం ఒక పాటలో పొందుపర్చారు. ‘మీ దానం మీ ధర్మం నిరుపేదల జీవాధారం’ అంటూ సాగే ఆ పాటలో ముక్తికి ధర్మమే ప్రధాన మార్గమని సూచించారు. ఒకవైపు భక్తి, వైరాగ్యాలతో ఈ పాట మానవునికి దిక్సూచిలా కనిపిస్తుంది. దానం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. జపతపాలు చేసే జడధారులు, సన్యాసులకన్నా దాన గుణంతో మసలే సామాన్య సంసారులే మిన్న అని అద్భుతంగా చెప్పారు. ఇందులో కవి హృదయం ఎలా ఆలోచించిందో, అలా మనం కూడా ఆ ఆలోచనను పాటించాలి అనుకుంటాం. మహరాజులకైనా, నిరుపేదలకైనా చావు పుట్టుకలు సమానమేనని, లోకం విడిచిపోయే తరుణంలో మనం ఏమీ తీసుకెళ్లలేమని చెబుతుందీ పాట. మరణానంతరమూ గుర్తుండిపోయేవారు ధర్మంతో దానాలు చేసినవారేనని చెబుతారు సముద్రాల. ధరణిలో నిలిచేది దాత పేరేనని, కానీ లుబ్ధులు, పిసినిగొట్టువారు, కీర్తికాముకులు, సన్మాన సత్కారాల నిమిత్తం విత్తం వితరణ చేసేవారు తమ ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెబుతారు. ధనమును సరైన వినియోగం చేసినవారికి పుణ్యం, పురుషార్థం దక్కుతాయని, చేయనివారికి పుణ్యం మాట దేవుడెరుగు కానీ, పాపులే అనగలరంటారు. దానం ధర్మమే పాటలో అంతరార్థం మానవుడికి ఓ కొత్త జ్ఞానాన్ని ప్రసాదించేలా ఉంటుంది. ఒక చేత్తో దానం చేస్తే రెండో చేతికి తెలియనంత గుప్తంగా దానముండాలి. కానీ ఈ కలికాలంలో కేవలం కీర్తి ప్రతిష్టలు, బిరుదులు పొందాలనుకునేవారే వితరణల పేరుతో దానాలను అందిస్తూండటం ఆశ్చర్యకరం. ఆ దాతలకు తమ పేర్లు ప్రకటించుకుంటే తమకే చేటనే విషయం కూడా ఊహకు అందదు. బహిరంగ దానాలలో బహు కష్టాలు ఎదురౌతాయి. అసలు దానం జోలికే పోనివారు, అపాత్రదానాలు చేయటం తెలియనివారు దానాలు కూడా ఒక్కొక్క అరిష్టదాయకంగా మారతాయి. స్వర్ణయుగ స్వరాలు, గీతాలు మనుషులకు మార్గదర్శకం చూపేలా సాగాయి. ఓ రకంగా హెచ్చరికలూ ఉన్నాయి ఈ పాటలో. వినేవాళ్లుంటే ఇలాంటి పాటలు యువ రచయితలు కూడా రాసేందుకు తీసుకోరు. అందుకే ఈ పాటలు నాకే కాదు శ్రోతలందరికీ ఇష్టం అవుతాయి.

-ఎంవి రమణకుమారి, హైదరాబాద్