Others

గోపాల.. గోపాల(నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెంకటేష్, పవన్‌కల్యాణ్ కలిసి నటించిన మల్టీస్టారర్ -గోపాల గోపాల. కిశోర్‌కుమార్ పార్థసాని దర్శకత్వంలో రూపొందిన చిత్రంలో శ్రీయా శరణ్, మిథున్ చక్రవర్తి, కృష్ణుడు, ఆశీష్ విద్యార్థి, మురళీశర్మ, పోసాని కృష్ణమురళి నటించి మెప్పించారు. హిందీలో విజయవంతమైన ‘ఓ మై గాడ్’ చిత్రానికి రీమేక్‌గా తయారైన ఈ సినిమా తెలుగు ప్రజలనూ అలరించింది. నాస్తికుడైన గోపాలరావు మోసపూరిత మాటలు చెప్పి దేవుడి విగ్రహాలు అమ్ముకుంటూ, భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటుంటాడు. ఒకసారి దేవుడి ఉనికినే ఆయన ప్రశ్నిస్తూ ఓ భక్త బృందాన్ని చెదరగొట్టి అపహాస్యం చేస్తాడు. అదేరోజు రాత్రి సంభవించిన భూకంపంలో గోపాలరావు దుకాణం ఒక్కటే నేలమట్టమైపోతుంది. చివరికి 80 లక్షల అప్పుతో వీధిన పడతాడు గోపాలరావు. దేవుడిని దూషించినందుకే ఇలాంటి ఆపద వచ్చిందని అందరూ దెప్పిపొడుస్తారు. అయినా ఆ విషయాన్ని నమ్మడు గోపాలరావు. దుకాణం నేలమట్టమైనందున బీమా మొత్తం చెల్లించడానికి సంస్థ అంగీకరించదు. దేవుడివల్ల జరిగిన నష్టం బీమాలో కవర్ అవదని అంటే, గోపాలరావు తనకు జరిగిన నష్టాన్ని దేవుడే భర్తీ చేయాలని కోర్టుకు వెళతాడు. కోర్టుకు ఏంచేయాలో తోచని పరిస్థితి. చివరికి దేవుడి దూతలమని చెప్పుకునే సంస్థలు, మిషనరీలకు, దేవాలయాలకు, ట్రస్టులకు గోపాలరావు సమన్లు పంపిస్తాడు. దేవుడిపై వాదన చేయడంలో గోపాలరావు మరింత తప్పు చేస్తున్నాడని అందరూ అంటున్నా, కోర్టు అతని కేసును స్వీకరిస్తుంది. భక్తులు గోపాలరావుపై పగబట్టి అతన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. అపుడు భగవంతుడే మనిషి రూపంలో వచ్చి గోపాలరావును కాపాడతాడు. అతనికి దేవుడు, దైవత్వం, మనిషి బలహీనతలు చెప్పి దేవుడి బదులు ప్రజలకు కళ్లు తెరిపించాల్సిన బాధ్యత నీదేనని చెబుతాడు. నాస్తికుడిగా వున్న గోపాలరావు ఈ సంఘటనతో ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? అనే అంశాలతో ఈ చిత్రం వైవిధ్యభరితంగా సాగుతుంది. ముఖ్యంగా మిథున్‌చక్రవర్తి బాబాగా చేసిన నటన ప్రేక్షకులకు గిలిగింతలు పెడుతుంది. ప్రస్తుత సమాజంలో ప్రజలకు ఓ మంచి సందేశమిస్తూ సాగిన ఈ చిత్రం ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలుస్తుందని నా అభిప్రాయం. అందుకే ఈ చిత్రం నాకు బాగా నచ్చింది.

-ఎం శ్రీనివాసరావు, యరజర్ల