Others

మధురం మధురం( నాకు నచ్చిన పాట)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగులో తొలిసారి దర్శకుడిగా ఆదుర్తి సుబ్బారావు పరిచయమైన చిత్రం -అమర సందేశం. హిందీలో విజయవంతమైన బైజూ బావారా చిత్రానికి రీమేక్‌గా దీన్ని రూపొందించారు. కథానాయకుడు అమరనాథ్. జూ.శ్రీరంజని, పద్మిని, రేలంగి, తుర్లపాటి విజయలక్ష్మి, మాస్టర్ మోహన్, మిక్కిలినేని, కెవిఎస్ శర్మలాంటి ఉద్దండ నటులు నటించిన చిత్రంలో అద్భుతమైన పాట -మధురం మధురం మనోహరం. ఈ చిత్రంలో పది పాటలున్నాయి. పది పాటలూ దేనికవే ఆణిముత్యాలు అనిపిస్తాయి. సాహిణి సంస్థ అందించిన చిత్రం ప్రింటు ఇపుడు దొరక్కపోయినా, అక్కడక్కడా ఈ పాట మాత్రం వినిపిస్తూ ఉంటుంది. శ్రీశ్రీ రచించిన గీతాన్ని ఎఎం రాజా తన మంత్ర ముగ్ధ కంఠంతో ఆలపించారు. ‘మధురం మధురం మనోహరం/ రాధామాధవ ప్రణయ విహారం’ అంటూ కథానాయకుడు కృష్ణుని భక్తిలో ఓలలాడుతూ, ఆ లీలలను పదే పదే గుర్తు చేసుకుంటూ తాదాత్మ్యంతో పాడే పాట అత్యద్భుతం. రాధామాధవుని ప్రణయ కేళీ విలాసాన్ని ఈ పాటలో శ్రీశ్రీ వర్ణించారు. ‘ఆ మనోజ్ఞ యమునా తీరంలో/ కోమల మలయ సమీరంలో/ ప్రశాంత నిశాంత సమయంలో/ పరిమళ లతా నికుంజములో’ అన్న చరణంలో చేకానుప్రాసాలు వైవిధ్యంగా వేస్తూ పాట రాయడం గమనించదగ్గ విషయం. కేళీ విలాసం మలయ కోమల అన్నపుడు వచ్చిన పదాలు, ప్రశాంత నిశాంత అన్నపుడు వినిపించే శాంతత, పరిమళ లతల ప్రక్కన సాగే లీలలు కళ్లకు కట్టినట్లు వర్ణించారు. రెండో చరణంలో నిరంతర సరస సరాగముతో/ నిగూఢ విచిత్ర వచనముతో/ వినోద వివాద లీలలతో/ విరచిత భావజ క్రీడలలో -అన్న చరణంలో శ్రీశ్రీ దర్శించిన శ్రీకృష్ణుని కేళీ విలాసాన్ని అద్భుతంగా వర్ణించబడ్డాయి. నిరంతర సరస సరాగ విచిత్ర వచన వినోద వివాద విరచిత లాంటి పదాలు వేయడం ఆయనకే చెల్లింది. ఎక్కడ తొట్రుపాటు లేకుండా కలం అలా సాగిపోతే.. అందుకు ఎఎం రాజా తన మధురస్వరంతో ఆలపించిన విధానం శ్రోతలను ఆకట్టుకుంటుంది. మొదట ఈ చిత్రాన్ని అక్కినేని నాగేశ్వరరావుతో రూపొందించాలనుకున్నారు. అది కార్యరూపం దాల్చలేదు. తరువాతే అమర్‌నాథ్‌ను కధానాయకుడిగా తీసుకొని రూపొందించిన చిత్రం అద్భుతమైన క్లాసిక్‌గా ప్రశంసలు అందుకుంది. ఎన్నో పాటలున్నా, ఎన్ని పాటలున్నా.. ఈ పాటంటే మాత్రం నాకెంతో ఇష్టం.
-జి రాజేశ్వరరావు, హైదరాబాద్