బిజినెస్

కుప్పకూలిన స్టాక్ మార్కెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 24: చైనాలో సంభవించిన కరోనా వైరస్ తాజాగా దక్షిణ కొరియా, ఇటలీ, ఇరాన్‌లలోనూ ప్రబలమైన ప్రభావం భారత స్టాక్ మార్కెట్‌పై తీవ్రంగా పడింది. ఈ ఏడాది రెండోసారి అత్యధిక స్థాయిలో మార్కెట్ పతనమైంది. అంతర్జాతీయ మార్కెట్లలో కరోనా కలకలాన్ని ప్రతిబింబిస్తూ భారతీయ మార్కెట్లు అట్టుడికాయి. ఫలితంగా సెనె్సక్స్ ఏకంగా 807 పాయింట్లు పతనమైంది. ముఖ్యంగా చైనాలో ఈ వైరస్ కేసులు మరింత తీవ్రం కావడంతోపాటు ఇతర దేశాల్లోనూ వ్యాపించడం మార్కెట్ల అలజడికి కారణమైంది. సోమవారం జరిగిన లావాదేవీల్లో వివిధ దశల్లో ఊగిసలాడిన సెనె్సక్స్ అంతిమంగా 806.89 పా యింట్లు పతనమై 40,363.23 వద్ద ముగిసింది. ఈ ఏడాది ఫిబ్రవరి 1న సెనె్సక్స్ 987 పాయింట్లు పతనమైంది. అది కూడా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ రోజునే కావడం గమనార్హం.
ఆ తర్వాత ఇంతటి భారీ పతనం ఇదే. కాగా, నిఫ్టీ కూడా 251.45 పాయింట్లు పతనమై 11,829.40 వద్ద ముగిసింది. దాదాపు సెనె్సక్స్‌లో నమోదైన అన్ని కంపెనీల షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. టాటా స్టీల్ షేరు ఏకంగా 6.39 శాతం నష్టపోయింది. ఇక వరుసగా ఓఎన్‌జీసీ, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ షేర్లు నష్టాలను చవిచూశాయి. సెక్టార్ వారీగా చూస్తే మెటల్ షేర్లు 6 శాతం, ఆటో షేర్లు 3.39 శాతం, టెలికాం షేర్లు 3.33 శాతం నష్టపోయాయి. అమెరికా అధ్యక్షుడు భార త్ పర్యటనకు వచ్చినా ఇరు దేశాల మధ్య ఎలాంటి వాణిజ్య ఒప్పందానికి అవకాశం లేకపోవడం కూడా దేశీయ మార్కెట్లను ప్రభావితం చేశాయి.
34 పైసలు తగ్గిన రూపాయి
ముంబయి, ఫిబ్రవరి 24: అంతర్జాతీయ మార్కెట్‌లో అమెరికా డాలర్ బలాన్ని పుంజుకోవడం, దేశీయంగా ఈక్విటీ షేర్ల అమ్మకాలు పెరిగిన నేపథ్యంలో భారత రూపాయి విలువ మరో 34 పైసలు తగ్గింది. అమెరికా డాలర్ మారకంతో పోలిస్తే గత మూడు నెలల్లో మొదటిసారిగా 34 పైసలు కోల్పోయి 71.98 పైసలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌పై కరోనా వైరస్ ప్రభావం కూడా ఇందుకు కొంతమేరకు కారణమని మార్కెట్ విశే్లషకులు చెబుతున్నారు.