చాలెంజింగ్ పాత్రలే ఇష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రిప్పింగ్ థ్రిల్లర్‌గా విడుదలకు ముందే ఇండస్ట్రీలో మంచి టాక్ సొంతం చేసుకుంది -రాహు. కొత్త దర్శకుడు సుబ్బు తెరకెక్కించిన చిత్రం 28న థియేటర్లకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో అభిరామ్ వర్మ ఆదివారం మీడియాతో ముచ్చటించాడు.
రాహు -ఉమెన్ సెంట్రిక్ మూవీ. కన్వర్షన్ డిజార్డర్‌తో బాధపడే అమ్మాయి తన జీవితంలోకి వచ్చిన రాహుతో ఎలా ఫైట్ చేసిందన్నదే ఇతివృత్తం. ఆసక్తికరమైన కథను దర్శకుడు సుబ్బు అద్భుతంగా మలిచాడు. ఆయన టెక్నికల్‌గా స్ట్రాంగ్. అందుకే -సినిమా కొత్త దర్శకుడు చేశాడన్న భావన కలిగించదు.
చాలామంది అనుకుంటున్నట్టు ఇది జాతకాల సినిమా కాదు. సినిమా చూశాక అర్థమవుతుంది. కథలో లవర్ బోయ్‌లా మొదలైన నా పాత్ర యాక్షన్‌కి టర్న్ తీసుకుంటుంది. వేరియేషన్స్ ఉన్న ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డాను. సవాళ్లతో కూడిన పాత్రల్ని ఎంపిక చేసుకోడానికి ఇష్టపడతాను. ఏ కథ చేసినా అందులో నా పాత్ర సవాల్ విసిరేలా ఉంటే హ్యాపీ. రాహు కథలో కృతిగార్గే పోషించిన పాత్రలోనూ చాలా సవాళ్లుంటాయి.
నా మొదటి చిత్రం తేజ దర్శకత్వంలో వచ్చిన హోరా హోరీ. తరువాత ‘మను’ సినిమా చేశాను. ఆ చిత్రంలో నా పెర్ఫార్మెన్స్ నచ్చి ఆడిషన్స్‌కి పిలిచిన దర్శకుడు సుబ్బు ‘రాహు’కు ఎంపిక చేసుకున్నారు. దర్శకుడు సైతం నాలాగే సినిమాపై ఫ్యాషన్స్‌తో యుఎస్ నుంచి ఇండస్ట్రీకి వచ్చినవాడే. సినిమాలో కృతిగార్గే, కాలకేయ ప్రభాకర్ పాత్రలు ఇంప్రెసివ్‌గా ఉంటాయి. శాటిలైట్, డిజిటల్ హక్కుల్ని జీ తెలుగు తీసుకోవడం సినిమాపై మా నమ్మకాన్ని పెంచింది.