తెలంగాణ

ఆరోగ్య తెలంగాణ కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిద్దిపేట, జనవరి 20 : తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య తెలంగాణగా మార్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికాబద్ధంగా కృషిచేస్తున్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు వెల్లడించారు. కంటివెలుగు పథకం ద్వారా రాష్ట్రంలో లక్షలాది పేద ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు ప్రసాదించారన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా నాగులబండ వద్ద ఎల్‌వీ ప్రసాద్ కంటి పరీక్షా కేంద్రాన్ని మంత్రి హరీష్‌రావు, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్, హెట్రోడ్రగ్స్ కంపెనీ చైర్మన్ పార్థసారథితో కలసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో వైద్య రంగానికి పెద్దపీట వేసినట్టు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావానికి ముందు హైదరాబాద్, వరంగల్‌లో మాత్రమే ప్రభుత్వ వైద్య కళాశాలలుండేవన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ఆదిలాబాద్, నిజమాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, సూర్యపేటలో మెడికల్ ఆసుపత్రులు ఏర్పాటు చేసి పేద ప్రజలకు ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం కోసమే పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఎల్‌వి ప్రసాద్ కంటి ఆసుపత్రులు తెలంగాణ, ఆంధ్ర, ఒడిసా, కర్నాటక రాష్ట్రాల్లో సేవలు అందిస్తున్నాయన్నారు. సిద్దిపేటలో ఎల్‌వి ఆసుపత్రి 20వ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఐదు లక్షల మందికి వైద్య సేవలు అందించేలా అన్ని ఆధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రిని నిర్మించినట్టు పేర్కొన్నారు. ఈ ఆసుపత్రి పరిధిలో మరో 10 సబ్‌సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఏవిధమైన వైద్య సేవలు అందుతాయో అదే విధమైన వైద్య సేవలు ఇక్కడ అందించనున్నట్టు పేర్కొన్నారు. పేద ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు, ఆపరేషన్లు చేస్తారన్నారు. ప్రతి ఒక్కరికీ కంటిచూపు చాలాముఖ్యమని, డయాబెటిక్, బీపీ ఉన్నవారు ప్రతియేటా కంటిపరీక్షలు చేయించుకోవాలన్నారు. స్మార్ట్ఫోన్ల వినియోగంతో ప్రతి ఒక్కరిలో కంటిచూపు మందగిస్తుందన్నారు. టెక్నాలజీకి బానిస కావద్దని..టెక్నాలజీని బానిస చేసుకోవాలని సూచించారు.
రూ. 400 కోట్లతో క్యాన్సర్ ఆస్పత్రి నిర్మాణం
తెలంగాణ సర్కార్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కంటివెలుగు పథకంలో హెరిటోడ్రగ్స్ అధినేత పార్థసారధి భాగస్వామ్యం ఉంన్నారు. హైదరాబాద్‌లో 10 ఎకరాల స్థలంలో 400 కోట్లతో క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ 10 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తిస్తే క్యాన్సర్ వ్యాధిని నయం చేయవచ్చన్నారు. క్యాన్సర్ వ్యాధిని గుర్తించే తొలి స్క్రీనింగ్ సెంటర్ సిద్దిపేటలో ఏర్పాటు చేయాలని సూచించారు. సిద్దిపేటలో ఎల్‌వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి నిర్మాణానికి సహకరించిన హెటిరో డ్రగ్స్ చైర్మన్ పార్థసారథి, ఎల్‌వీ ప్రసాద్ ఆస్పత్రి చైర్మన్ నాగేశ్వర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ఏల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ఈప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ రోజాశర్మ, ఎల్‌వీ ప్రసాద్ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రావు, హెటిరోడ్రగ్స్ అధినేత పార్థసారథిలు తదితరులు ప్రసంగించారు. ఆనంతరం వారిని మంత్రి హరీష్‌రావు ఘనంగా సన్మానించారు. ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, ఉన్నత విద్యామండలి సభ్యుడు రాంమోహన్‌రెడ్డి, రత్నాకర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్లు పాల సాయిరాం, కాముని శ్రీనివాస్, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
'చిత్రం... జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మంత్రి హరీష్‌రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి