Others

కళ్యాణ మంటపం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వి మధుసూధన రావు గొప్ప నిర్మాత. అంతకుమించి మంచి దర్శకుడు. చేపట్టిన ఏ ప్రాజెక్టునైనా -సూపర్ హిట్ మార్గంలో నడిపించిన ఘనుడు. అందుకే ‘విక్టరీ’ ఇంటిపేరైంది. ఆయన దర్శకత్వం వహించిన గొప్ప చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది -కల్యాణ మంటపం. సంఘంలో వేళ్లూనుకున్న దురాచారాలను ఎత్తిచూపే కథకు తనే దర్శకత్వం వహించాలన్న ఆలోచనతో -కన్నడ అవార్డు చిత్రం ‘గజ్జెపూజ’ను ఎంచుకున్నారు. ఆ చిత్ర మూలకథలోని ‘దేవదాసి’ వ్యవస్థ, అందుకు బలైపోతున్న మహిళా జీవితాలను.. తెలుగు రాష్ట్రంలోని ఓ ప్రాంతంలో వేళ్లూనుకున్న అలాంటి వ్యవస్థకు అన్వయస్తూ సమగ్ర కథను సమకూర్చుకున్నారు. అదే -1971లో ‘కళ్యాణ మంటపం’ టైటిల్‌తో విడుదలైన చిత్రం. దేవదాసి కుటుంబంలో పుట్టినా బాగా చదువుకుని, ఉద్యోగం చేస్తూ సొంతకాళ్లపై నిలబడి, నచ్చిన వాడిని వివాహం చేసుకోవాలనుకున్న చంద్రముఖి (కాంచన) కథ ఇది. చిన్నప్పటినుంచీ ఆమెను చూస్తూ, ఆమెతో కలిసి పెరిగి పెద్దవాడైన శోభన్‌బాబు చంద్రముఖిని ప్రేమిస్తాడు. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేస్తాడు. అయితే, సాధారణ వ్యక్తి మాదిరిగానే చెప్పుడు మాటలకులోనై ఆమెను అనుమానిస్తాడు. ఓ రాత్రి సమయంలో తండ్రికాని తండ్రి గుమ్మడితో కాంచన మాట్లాడుతుండటాన్ని కిటికీలోంచి చూసిన శోభన్‌బాబు అపార్థం చేసుకుని, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. కళ్యాణ మంటపానికి నడిపించేవాడు లేక, దేవదాసి వృత్తిని కొనసాగించలేక కాంచన ‘గజ్జెపూజ’నాడే బలవన్మరణానికి పాల్పడుతుంది. తరువాత నిజం తెలుసుకున్న శోభన్‌బాబు, కుటుంబీకులు విచారిస్తారు. సినిమాలో కథతో సమాంతరంగా సాగిన హాస్య సన్నివేశాలు అలరిస్తాయి. ‘ఒకడిని నమ్ముకుంటే పతివ్రత, పదిమందిని నమ్ముకుంటే పతిత’ అనే డైలాగ్ నాగభూషణం ద్వారా చెప్పించి -పైకి పతివ్రతగా నటిస్తూ భర్తను మోసగించి బయట మగాళ్లతో ప్రేమకలాపాలు సాగించే భార్యలకు బుద్ధివచ్చేలా అద్భుతమైన సన్నివేశాన్ని కథలోకి అమర్చాడు దర్శకుడు మధుసూధనరావు. చిత్రంలో కాంచన నటన ఎవరెస్టు శిఖరాలను తాకుతుంది. కెవి మహాదేవన్ స్వర రచనలో దేవులపల్లి కృష్ణశాస్ర్తీ రచించిన -చుక్కలు పాడిన శుభమంత్రం (గానం: సుశీల), -పిలిచే వారుంటే (గానం: సుశీల), -సరిగమ పదనిసా (గానం: బాలు, సుశీల) గీతాలు నేటికీ అలరిస్తున్నాయి. సినిమా కేవలం వినోద సాధనంగానే కాకుండా సమాజంలోని దురాచారాలను ఎత్తిచూపగలదని చాటి చెప్పిన గొప్ప సినిమా.
-ఎస్‌ఎస్ శాస్ర్తీ, విశాఖపట్నం