రాశిఫలం - 01-14-2020

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ చవితి సా.6.14 , కలియుగం-5121 ,శాలివాహన శకం-1941
నక్షత్రం: 
మఖ ఉ. 11.20 విశేషాలు: భోగి
వర్జ్యం: 
సా. 6.48 నుండి 8.17వరకు
దుర్ముహూర్తం: 
ఉ.08.00 నుండి 09.12 వరకు, తిరిగి రా.10.48నుండి 11.36వరకు
రాహు కాలం: 
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఋణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్తపడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం వుంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు వస్తాయి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) అనుకోకుండా కుటుంబంలో కలహాలేర్పడే అవకాశముంటుంది. అశుభవార్తలు వినాల్సి వస్తుంది. ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్త పడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ సహకారాలకై వేచి వుంటారు. దైవదర్శనం లభిస్తుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) విందులు, వినోదాలకు దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశముంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురగును. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) కోపాన్ని అదుపులో నుంచుకొనుట మంచిది. మానసికాందోళనను తొలగించుటకు దైవధ్యానం అవసరం. శారీరక అనారోగ్యంతో బాధపడతారు. కుటుంబ విషయాలు సంతృప్తికరంగా నుండవు. వృధా ప్రయాణాలెక్కువవుతాయి. ధనవ్యయం తప్పదు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) కుటుంబంలో చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశం వుంది. పరిస్థితిని మీ అదుపులో ఉంచుకోండి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. ఆర్థిక ఇబ్బందులను అధిగమించుటకు ఋణప్రయత్నాలు చేస్తారు. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఆలస్యంగా లభిస్తాయి.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబమంతా సంతోషంగా నుంటారు. అనుకొన్న పనులన్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యమేర్పడుతుంది. స్థిర నివాసముంటుంది. వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ ఫలిస్తాయి. సూక్ష్మ విషయాలను గ్రహిస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) తలచిన కార్యాలన్నియు విజయవంతంగా పూర్తిచేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశం లభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడతాయి.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) వ్యాపారంలో విశేష లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభముంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఆకస్మిక ధనలాభముంది. రాజకీయ రంగంలోనివారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభించును. అన్నింటా విజయానే్న సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి వుంటుంది.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల ఉండరాదు.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసికానందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటివరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తిచేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు.
Date: 
Tuesday, January 14, 2020
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి