AADIVAVRAM - Others
శ్రమ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 30 November 2019
శ్రమించని వ్యక్తికి చరిత్రలో చోటు లేదు. చాలా మంది శ్రమించకుండా చరిత్రలో వుండాలని అనుకుంటారు. అది సాధ్యం కాదు.
రెండూ కావాలని అనుకోవడం అసమంజసం.
రెండింటిలో ఏదో ఒకదాన్ని మనం ఎంపిక చేసుకోవాలి.
చాలామంది శ్రమించరు. కానీ పేరు ప్రఖ్యాతులూ డబ్బూ కావాలని కోరుకుంటారు.
అది సాధ్యమా?
చాలా మంది జీవిత చరిత్రలను పరిశీలిస్తే అది సాధ్యం కాదని తెలిసిపోతుంది.
జీవితాన్ని సవాలుగా స్వీకరించాలి.
ఏదో ఒక పనిలో మన వారసత్వం వుండే విధంగా పని చేయాలి.
శిఖరాలని అధిరోహించకపోయినా పర్వాలేదు. కనీసం కొండలని ఎక్కే విధంగా మన ప్రయాణం కొనసాగాలి.
మనందరిలో ఆ శక్తి సామర్థ్యాలు వున్నాయి. ఈ ప్రపంచాన్ని ఎంతో కొంత అందంగా తీర్చిదిద్దే శక్తిసామర్థ్యాలు మనలో వున్నాయి.
మనం శ్రమిస్తేనే అది సాధ్యం.