క్రైమ్/లీగల్

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఇబ్బందేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 19: తెలంగాణలో బస్సు రూట్ల ప్రైవేటీకరణపై రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంటే అది తప్పు ఎలా అవుతుందని రాష్ట్ర హైకోర్టు మంగళవారం నాడు ప్రశ్నించింది. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఇబ్బంది ఏమిటి? భవిష్యత్‌లో వచ్చే సమస్యలను ముందే ఎందు కు ఊహిస్తారు? ఇంకా ప్రైవేటీకరణ జరగలేదు కదా? అని హైకోర్టు పిటిషనర్లను ప్రశ్నించింది. కేంద్ర మోటారు వాహనాల చట్టం -67 ప్రకారం ఆర్టీసీ రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుందని, ఆర్టీసీకి ప్రైవేటు రవాణా వ్యవస్థలను సమాంతరంగా నిర్వహించే అధికారం ప్రభుత్వానికి ఉన్నపుడు ప్రైవేటీకరణపై మంత్రివర్గం నిర్ణయం తప్పు ఎలా అవుతుందని హైకోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 102 ప్రకారం ఏ మార్పు చేసినా ఆర్టీసీకి సమాచారం ఇవ్వాలని పిటిషనర్ తరఫున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారని, ఆర్టీసీకి ఎలాంటి నష్టం జరగదని సీఎం కేసీఆర్ చెప్పారన్న మాటకు ఉన్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ముఖ్యమంత్రి ఏం చెప్పారన్నది తమకు సంబంధం లేదని పేర్కొంది. కేబినెట్ నిర్ణయం చట్ట బద్ధమని భావిస్తున్నారా ? చట్టవిరుద్ధమని భావిస్తున్నారా? అనేదే తమ ముందున్న అంశమని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ చట్టబద్ధంగా ప్రైవేటీకరణ ప్రక్రియను అనుసరిస్తోందా లేదా అన్నది తెలియకుండా అప్పుడే చట్టవిరుద్ధమని ఎలా ప్రకటిస్తామని ఉన్నత న్యాయస్థానం నిలదీసింది.
సెక్షన్ 102 ప్రకారం ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రక్రియ ఏమిటో వివరించాలని పిటిషనర్ తరఫున న్యాయవాదికి హైకోర్టు సూచించింది. మార్పులు చేస్తే సెక్షన్ 102 ప్రకారం ఆర్టీసీకి తెలపాలని, మార్పులను గెజిట్‌లో ప్రచురించాల్సి ఉంటుందని న్యాయవాది పేర్కొన్నారు. ప్రతిపాదిత మార్పులను స్థానిక దినపత్రికల్లో ప్రచురించాలని చెప్పారు. దీనిపై హైకోర్టు స్పంది స్తూ రవాణా రంగంలో ప్రైవేటీకరణ చేయవద్దని ఏ చట్టమైనా చెబుతుందా? అని ప్రశ్నించింది. ప్రపంచం గ్లోబలైజేషన్, కేపిటలైజేషన్ కాలం లో ఉందని గతంలో దేశంలో ప్రభుత్వ ఎయిర్‌లైన్స్ మాత్రమే ఉండేదని, తర్వాతి కాలంలో చాలా ప్రైవేటు ఎయిర్‌లైన్స్ వచ్చాయని అన్నీ విజయవంతంగా పనిచేస్తున్నాయని హైకోర్టు పేర్కొంది. అనంతరం తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది.