హైదరాబాద్

జీహెచ్‌ఎంసీ ఉద్యోగులకు వైద్య బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీలోని పర్మినెంటు ఉద్యోగులు 5వేల 156 మందికి, వారి కుటుంబ సభ్యులకు వైద్య బీమా సౌకర్యాన్ని ఈ నెల 1వ తేదీ నుంచి అమల్లోకి తెచ్చారు అధికారులు. ఈ బీమా నిమిత్తం ఇన్సూరెన్స్ కంపెనీకి రూ.3.72 కోట్ల చెక్కును మేయర్ బొంతు రామ్మోహన్ చెక్కు రూపంలో బీమా సంస్థకు సోమవారం అందజేశారు. మొదటి విడత మొత్తాన్ని యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ ఏజెన్సీకి చెల్లించినట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగి, భార్య లేక భర్త, ఇద్దరు పిల్లలు, తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఆరుగురికి ఈ వైద్య బీమా అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. నవంబర్ 1వ తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్లు వెల్లడించారు. ఈ బీమా సౌకర్యంలో భాగంగా కనీసం మూడు లక్షల రూపాయల విలువ గల వైద్య బీమాను వర్తింపజేయనున్నారు. మరో మూడులక్షల రూపాయల వరకు కూడా దీన్ని వినియోగించే వెసులుబాటు కల్పించినట్లు మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. జీహెచ్‌ఎంసీలో ఉన్న 5వేల 156 మంది రెగ్యులర్ ఉద్యోగులందరూ తమ కుటుంబ, ఉద్యోగ వివరాలను సంబంధిత అధికారులకు అందజేయాలని కోరగా, ఇప్పటి వరకు 3142 మంది మాత్రమే శాశ్వత ఉద్యోగులు తమ వివరాలను అందించినట్లు మేయర్ తెలిపారు. ఈ బీమా చెక్కును అందజేసిన వారిలో మేయర్‌తో పాటు అదనపు కమిషనర్(ఫైనాన్స్) జయరాజ్ కెనడీ తదితరులున్నారు.