హైదరాబాద్

ఆర్టీసీ సమ్మెతో ‘మెట్రో’కు ఆదరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ప్రతిరోజు లక్షలాది మంది మహానగరవాసులను తమ గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసి బస్సులు సమ్మె కారణంగా ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను పెట్టి బస్సులను నడుపుతున్నా, ప్రయాణికుల అవసరాలకు అవి ఏ మాత్రం సరిపోవటం లేదు. పైగా టికెట్, భద్రత లేకుండా ప్రయాణించేందుకు జనం కూడా ముందుకు రావటం లేదు. ఈ క్రమంలో ఇప్పటికే నాగోల్ నుంచి అమీర్‌పేట మీదుగా హైటెక్‌సిటీ వరకు, అలాగే మియాపూర్ నుంచి అమీర్‌పేట మీదుగా ఎల్‌బీనగర్ వరకు అందుబాటులో ఉన్న మెట్రోరైలుకు రోజురోజుకి ఆదరణ పెరుగుతోంది.
ఒక్క స్టేజీకి రూ.15 ఛార్జీలు వర్తింపజేస్తున్న ఈ మెట్రోరైలు అందుబాటులోకి వచ్చిన కొత్త ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారని వాపోయిన నగరవాసులు ఇపుడు ప్రైవేటు వాహానాల నిలువుదోపిడి కన్నా మెట్రోరైలు ప్రయాణం ఎంతో చౌక అని, ఎంతో సురక్షితమని వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్టీసి బస్సులు రాకపోకలు సాగిస్తున్న సమయంలో సుమారు లక్షా 50వేల నుంచి రెండు లక్షల మధ్య ప్రయాణికులు మెట్రోరైలులో రాకపోకలు సాగించగా, ఆర్టీసి బస్సుల సమ్మె కారణంగా అదనంగా మరో లక్షన్నర నుంచి రెండు లక్షల మంది ప్రయాణికులు మెట్రో సేవలను వినియోగించుకుంటున్నారు.
నాగోల్ నుంచి హైటెక్‌సిటీ, మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ కారిడార్లకు పరిసర ప్రాంతాలకు చెందిన ప్రయాణికులు ఉదయం, సాయంత్రం ఆఫీసులు, విద్యాలయాలకు వెళ్లే వారు మెట్రోలోనే ప్రయాణిస్తున్నారు. సాధారణంగా మహానగరంలో ఆర్టీసి బస్సులు సైతం ఆఫీసు వేళల్లో ఫుల్‌గా వెళ్లేవి. కానీ ఆర్టీసి సమ్మె కారణంగా మెట్రోరైలు ప్రతి ట్రిప్పు కూడా ప్రయాణికులతో కిక్కిరిసి రాకపోకలు సాగిస్తోంది. కనీసం నిల్చుండి ప్రయాణించేందుకు వీల్లేకుండా రద్దీ నెలకొంది. ఈ నెల 22వ తేదీన అదనంగా నాలుగు రైళ్లను అందుబాటులో ఉంచి, మొత్తం 830 ట్రిప్పులు నడపగా, ఇందులో 4లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ఇందులో అత్యధికంగా 26వేల మంది ప్రయాణికులు అమీర్‌పేటలో, 25 వేల మంది హైటెక్‌సిటీలో, మరో 23వేలు ఎల్‌బీనగర్‌లో మెట్రోరైలు ఎక్కినట్లు అధికారులు వెల్లడించారు.
అత్యల్పంగా ఉప్పల్‌లో 14వేల మంది ఈ రైలు ఎక్కినట్లు పేర్కొన్నారు. ఆర్టీసి సమ్మె కారణంగా హైటెక్‌సిటీలోని వివిధ ఐటీ కంపెనీలు, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తూ నాగోల్, ఎల్‌బీనగర్, ఉప్పల్, బోడుప్పల్, మియాపూర్ తదితర ప్రాంతాల్లో నివసించే వారు మెట్రో ప్రయాణానే్న ఎంచుకుంటున్నారు.