తెలంగాణ

టీఆర్‌ఎస్ సర్కారుపై ప్రజల్లో అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: దేశంలో ఎక్కడా లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో నెలకొందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పట్ల ప్రజలు తీవ్ర అసహనంతో ఉన్నారన్నారు. తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి రోడ్డెక్కిన కార్మికులను ఇంతలా అణచివేస్తున్న ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదన్నారు. 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రెండు వారాలు దాటినా ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేదన్నారు. చివరకు హైకోర్టు ఆదేశించినా కోర్టు ఆదేశాలను బేఖాతర్ చేస్తూ ఏం జరుగుతుందో చూద్దామన్నట్టుగా సీఎం కేసీఆర్ మొండిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. పార్టీ సంస్థాగత సమావేశంలో పాల్గొనడానికి ఆదివారం హైదరాబాద్‌కు వచ్చిన అరుణ్ సింగ్ ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో చివరివరకూ బీజేపీ అండగా ఉంటుందన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేయలేదన్నారు. హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించబోతుందని అరుణ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
ఇదిలావుండగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును కేంద్ర ప్రభుత్వం గమనిస్తోందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ అప్రజాస్వామిక పాలన మెడలు వంచడానికి మేధావులతో పాటు అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆర్టీసీతోపాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాడుకోవాలన్నారు. ఖాతరు చేయకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు. ఆర్టీసీ సమ్మెను మరింత ఉధృతం చేస్తామని, ఈ విషయంలో కార్మికులకు బీజేపీ చివరిదాకా అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఆర్టీసీ కార్మికుల సమ్మె వారి వేతనాల కోసమే కాదని, సంస్థ పరిరక్షణ కోసం కూడా అని లక్ష్మణ్ అన్నారు. ఇలాఉండగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో పలువురు మహిళా నేతలు, వైద్యులు ఆ పార్టీలో చేరారు.
*చిత్రం... హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం జరిగిన ఆఫీస్ బేరర్ల సమావేశంలో పాల్గొన్న పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్