ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీకి తక్షణం వెయ్యి కోట్లు విడుదల చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 15: ఏపీఎస్ ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందుల నుంచి బయట పడేందుకు ప్రభుత్వం ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1572 కోట్లలో కనీసం వెయ్యి కోట్లు తక్షణం విడుదల చేయాలని గుర్తింపు సంఘం ఎంప్లారుూస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లు వేర్వేరుగా సీఎం వైఎస్ జగన్‌కు విజ్ఞప్తి చేశాయి. ఎన్‌ఎంయు రాష్ట్ర అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి వై శ్రీనివాసరావు, ప్రచార కార్యదర్శి ఎస్ రాజేష్‌కుమార్‌ల నేతృత్వంలో ఓ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయానికి వెళ్లి సీఎం ముఖ్య కార్యదర్శులకు వినతిపత్రాలు సమర్పించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంకు జరుగుతున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నామని అయితే గతంలో యాజమాన్యం అంగీకరించిన విధంగా అక్టోబర్ నెలాఖరులో కార్మికులకు చెల్లించాల్సిన అరియర్స్ 40 శాతంను తక్షణం చెల్లించాలని కోరారు. ఆర్టీసీ కోసం గత సెప్టెంబర్ 9వ తేదీ జీవో 220 ద్వారా కేటాయించిన రూ. 1572 కోట్లను తక్షణమే విడుదల చేసి ఆర్థిక సహాయం అందించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1572 కోట్లలో తక్షణం కనీసం వెయ్యి కోట్లు మంజూరు చేయాలని గుర్తింపు సంఘం ఈయూ రాష్ట్ర అధ్యక్షులు వైవీ రావు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరావు ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. సొసైటీలో కార్మికులు ఏళ్ల తరబడి దాచుకున్న సొమ్ము నుంచి కనీసం రుణాలు కూడా మంజూరుకాని దౌర్భాగ్య స్థితి నెలకొందన్నారు.