రాశిఫలం -10/15/2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
విదియ రాత్రి 3.54, కలియుగం-5121, శాలివాహన శకం-1941
నక్షత్రం: 
అశ్విని ఉ.11.57
వర్జ్యం: 
ఉ.7.36 నుండి 9.20 వరకు తిరిగి రా.10.11 నుండి 11.53 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.8.32 నుండి 9.18 వరకు, తిరిగి రా.10.47 నుండి 11.37 వరకు
రాహు కాలం: 
మ.3.00 నుండి 4.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. సమాజంలో గౌరవం లభిస్తుంది. ఋణప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మీరు కోరుకున్న మార్పులు వస్తాయ. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) మిక్కిలి ధైర్య సాహసాలు కలిగియుంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. ఋణప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మీరు కోరుకున్న మార్పులు వస్తాయ.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధనుండి రక్షించుకోవడం అవసరం. కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్లలపట్ల జాగ్రత్తగా నుండుట మంచిది. వృత్తిరీత్యా గౌరవ మర్యాదలు పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుంటాయి. మనోల్లాసాన్ని పొందుతారు.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది. మోసపోయే అవకాశాలుంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభిస్తారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కళాకారులకు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. సమాజంలో గౌరవం లభిస్తుంది.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ఆకస్మిక ధననష్టం జరుగకుండా జాగ్రత్తపడుట మంచిది. మనస్తాపానికి గురి అవుతారు. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. నూతన కార్యాలు వాయిదా వేసుకోక తప్పదు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం చేస్తారు. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండట మంచిది. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
కుంభం: 
(ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా నుంటారు. అభివృద్ధి ఉంటుంది.. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా నుండుట మంచిది
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) ఋణప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. స్ర్తిలకు స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. ఆర్థిక ఇబ్బందులతో ఆటంకాలు ఏర్పడుతాయ. ఆత్మీయుల సహకారం లభిస్తుంది.
Date: 
Tuesday, October 15, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి