తెలంగాణ

సమ్మె ఉధృతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 9: ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమంగా ఆర్టీసీ సమ్మెను ఉధృతం చేయాలని రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న నేతలు తీర్మానించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ సమ్మెపై ‘అఖిలపక్ష’ సమావేశాన్ని నిర్వహించారు. జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, ఎమ్మెల్సీ రామచందర్ రావు, తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెను దేశం మొత్తం గమనిస్తున్నదని వారు అన్నారు. కార్మికుల పట్ల సీఎం వైఖరి రాష్ట్రంలో నిరంకుశ పాలకు అద్దం పడుతోందని ధ్వజమెత్తారు. నిజాం కాలంలో స్థాపించిన రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థను ప్రజల కోసం పనిచేసే సంస్థగా అభివర్ణించారు. ఇతర సేవా రంగాలకు సంబంధించిన సంస్థలుగానే ఆర్టీసీని కూడా పరిగణించాల్సి ఉంటుందే తప్ప లాభాలు రావడం లేదని అనడం సరికాదని వ్యాఖ్యానించారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను ముఖ్యమంత్రిగా పరిష్కరించాల్సిందిపోయి సెల్ఫ్ డిస్మిస్ అంటూ మాట్లాడటం పిచ్చితనమని వక్తలు మండిపడ్డారు. యూనియన్లు వద్దని ఇచ్చిన అల్టీమేటం కేవలం ఆర్టీసీకే పరిమితం అవుతుందా? లేదా అన్ని శాఖలకు వర్తిస్తుందా? అనేది ఉద్యోగులు ఆలోచించుకోవాలని హెచ్చరించారు. ఆర్టీసీని సాకుగా చూపుతూ మొత్తం ఉద్యోగులందరినీ భయాందోళనకు గురి చేసే కుట్రలు సాగుతున్నదని, కాబట్టి ప్రతి ఉద్యోగీ అప్రమత్తంగా ఉండాలనీ సూచించారు. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడానికి
ప్రభుత్వమే కారణమన్నారు. అయితే, ‘పండగ పూట సమ్మె చేస్తారా’ అంటూ కార్మికులను దోషులుగా చిత్రీకరించాలని చూస్తున్నారని మండిపడ్డారు. జూన్ మాసంలో తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ ఉద్యోగులు ఇచ్చిన సమ్మె నోటీసులను మరిచారా? అని ప్రశ్నించారు. నెలల తరబడి సమస్యలు పరిష్కరించకుండా నేడు కార్మికులదే తప్పంటూ తమ ఆధీనంలో ఉన్న ప్రచార మాధ్యమాలలో తప్పుడు కథనాలను వ్యాప్తిచేస్తున్నారని విమర్శించారు. ఆర్టీసీని ముకుమ్మడిగా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకోవడానికి, మెగా కృష్ణారెడ్డికి సంస్థను అప్పగించే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్టీసీ నష్టాల్లోకి పోవడానికి కారణం ప్రభుత్వం కాదా అని నిలదీశారు. సేవా భావంతో నడుస్తున్న ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని కేసీఆర్ సర్కారును వారు ప్రశ్నించారు. కార్మికులను అణిచివేతల విధానాలను ఎట్టి పరిస్థితిలోనూ సహించేంది లేదని అన్నా. ఆనాడు తెలంగాణ ఏర్పాటు కోసం జరిగిన సకల జనుల సమ్మె ఆర్టీసీ నుంచే ప్రారంభం అయిందని, ప్రస్తుతం తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునేందుకు ఆర్టీసీ కార్మికులు సమ్మె దోహదపడనుందని అన్నారు. ఇది కేవలం ఆర్టీసీకి మాత్రమే పరిమితమైన సమ్మె కాదని, నిరంకుశ విధానాలతో, నిర్బంధాలతో కొనసాగుతున్న పాలనను అంతం చేసేందుకు చేస్తున్న సమ్మె అని వక్తలు వ్యాఖ్యానించారు. అన్ని వర్గాల ప్రజలు ఆర్టీసీ కార్మికుల వెంట నడవాల్సిన అవసరం ఉందన్నారు. త్వరలో ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాయలని, గవర్నర్, చీఫ్ సెక్రెటరీలకు వినతి పత్రాలు అందించాలని ఈ సమావేశంలో తీర్మానించారు. పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేయడంతో పాటు భారీ బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించి భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని చెప్పారు.
*చిత్రం...తెలంగాణ ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొన్న అఖిలపక్ష నేతలు