ఆంధ్రప్రదేశ్‌

హైకోర్టును తరలించవద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (లీగల్), సెప్టెంబర్ 23: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర రాజధాని అమరావతి నుండి తరలిస్తున్నారన్న ఊహాగానాలపై ఐదు జిల్లాల్లో ఆందోళనలు ఉద్ధృతమయ్యాయి. గత వారం మొత్తం నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో విధులు బహిష్కరించి నిర్వహించిన నిరసన కార్యక్రమాలు ఈ వారం కూడా కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఆయా జిల్లాల్లో న్యాయవాదులు సోమవారం విధులు బహిష్కరించి జిల్లా కలెక్టర్లకు వినతిపత్రాలు సమర్పించారు. గుంటూరు జిల్లా కలెక్టరేట్‌కు బార్ అసోసియేషన్ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్లిన న్యాయవాదుల బృందం కలెక్టర్ ఐ శామ్యూల్ ఆనంద్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. హైకోర్టును రాజధాని ప్రాంతమైన నేలపాడులోనే ఉంచాలని, కర్నూలు తరలిస్తున్నారన్న అంశంపై తక్షణమే ప్రభుత్వం స్పందించాలని కలెక్టర్‌లకు సమర్పించిన వినతిపత్రాల్లో పేర్కొన్నారు. ఇలా ఉండగా రాష్ట్ర హైకోర్టులో కూడా సోమవారం మధ్యాహ్నం భోజన విరామ సమయంలో న్యాయవాదులంతా నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి చాగారి ప్రవీణ్‌కుమార్, ఎం సత్యనారాయణమూర్తి, తేలప్రోలు రజని, కొంగర విజయలక్ష్మి, యు దుర్గాప్రసాదరావు, వెంకట రమణ తదితర న్యాయమూర్తులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. కోర్టు బయట ప్లకార్డులు, నినాదాలతో ఆయా జిల్లాల న్యాయవాదులంతా హోరెత్తించారు. నిరసన కార్యక్రమాలు కొనసాగింపులో భాగంగా ఈ వారాంతం వరకు పలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నామని, ఐదు జిల్లాల ప్రిసీడియం సభ్యులైన గుంటూరు బార్ అధ్యక్షుడు చిలుకూరి నరేంద్రబాబు, రాష్ట్ర బార్‌కౌన్సిల్ సభ్యులు సోమసాని బ్రహ్మానందరెడ్డి, తదితరులు తెలిపారు.
*చిత్రం...హైకోర్టు ఎదుట ఆందోళన చేస్తున్న న్యాయవాదులు