ఆంధ్రప్రదేశ్‌

శ్రీశైలానికి మళ్లీ వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీశైలం టౌన్, సెప్టెంబర్ 18: కృష్ణానది పరివాహాక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహాం మళ్లీ ప్రారంభమైంది. దీంతో డ్యామ్ గేట్లను గురువారం మరోసారి తెరిచి దిగువకు నీటిని విడుదల చేసే పరిస్థితులు నెలకొన్నాయి. ఎగువన కురిసిన వర్షాలతో పాటు లోకల్ క్యాచ్‌మెంట్ ఏరియాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలానికి భారీగా వరద వచ్చి చేరుతోంది. సెప్టెంబర్ 14న డ్యామ్ రేడియల్ క్రస్టుగేట్లను తెరిచి నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేశారు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయానికి తుంగభద్ర, జూరాల ద్వారా 1,25,888 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరుతోంది. బ్యాక్ వాటర్ ద్వారా కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌కు 8 వేల క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. కుడిగట్టు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 25,675 క్యూసెక్కులు, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా 42,378 క్యూసెక్కుల నీటిని సాగర్‌కు విడుదల చేస్తున్నారు. మొత్తం శ్రీశైలం డ్యామ్ నుంచి 80,475 క్యూసెక్కులు బయటకు వెళ్తోంది. డ్యామ్‌లో 210.99 టీఎంసీల నీరు నిల్వ ఉంది.