క్రైమ్/లీగల్

ఖైతాన్ విచారణకు గ్రీన్ సిగ్నల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18: వీవీఐపీ చాపర్ కుంభకోణంలో ప్రధాన నిందితుడు గౌతం ఖైతాన్‌ను విచారించడానికి మార్గం సుగమమైంది. ఆయనను ఈ కేసులో విచారించకూడదని ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు వ్యతిరేకించింది.
వీటిని అమలు చేయబోమని న్యాయమూర్తులు అరుణ్ మిశ్రా, ఎంఆర్ షా, బీఆర్ గవాయ్‌తో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే, తీర్పును మాత్రం రిజర్వులో ఉంచింది. ఖైతాన్‌ను విచారించవద్దని ఢిల్లీ కోర్టు ఇచ్చిన తీర్పును కేంద్రం సుప్రీంకోర్టు సవాల్ చేసింది. 2016లో అమల్లోకి వచ్చిన బ్లాక్‌మనీ చట్టం కింద 2015 జూలై మాసంలో నమోదైన కేసును విచారించడానికి వీల్లేదని ఖైతాన్ చేసిన వాదనలపై గతంలో ఢిల్లీ హైకోర్టు సానుకూలంగా స్పందించింది. ఆయనను విచారించవద్దంటూ ఆదాయ పన్ను శాఖను ఆదేశించింది. కాగా, ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులపై కేంద్ర ప్రభుత్వం లేవనెత్తిన అభ్యంతరాలపై సుప్రీంకోర్టు విచారణను మొదలుపెట్టింది. ప్రస్తుతానికి ప్రాథమిక సాక్ష్యాధారాల కింద కేసును పరిగణిస్తున్నామని, కాబట్టి ఖైతాన్‌ను విచారించేందుకు ఎలాంటి అభ్యంతరం ఉండదని తెలిపింది. అయితే, ఈ మేరకు ఉత్తర్వులను మాత్రం జారీ చేయలేదు. తీర్పును వాయిదా వేస్తున్నట్టు మాత్రమే ప్రకటించింది.