ఆంధ్రప్రదేశ్‌

పోలీసులకు భయపడి పోరాటాలు ఆపబోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 11: పోలీసులకు భయపడి ప్రజాపోరాటాలను ఎట్టి పరిస్థితుల్లోను ఆపే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని శ్రీనివాస్(నాని) స్పష్టం చేశారు. అరెస్ట్‌లతో సమస్యకు పరిష్కారం చూపించలేరని బుధవారం ట్విట్టర్ వేదికగా నాని అన్నారు. తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడిక్కడ అడ్డుకోవడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. తనను కూడా ఛలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్తున్న సమయంలో పోలీసులు అడ్డుకున్నారని, ఇటువంటి దుర్మార్గ చర్యలు కాశ్మీర్‌లో కూడా చూడలేదన్నారు. ఏపీ పోలీసులకు భయపడి తాము పోరాటాలు ఆపబోమని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై తమ పోరాటం నిరంతరం కొనసాగిస్తామని హెచ్చరించారు. పల్నాడులో పోలీసులు వివక్షాపూరితంగా, ఏకపక్షంగా వ్యవహరించడమే ఈ సమస్యకు మూల కారణమన్నారు. దీనిలో భాగంగానే టీడీపీ నేతలపై తప్పుడు కేసులను నమోదు చేశారని ఆరోపించారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం రాజ్యాంగ విలువలను కాపాడాలని, అది ప్రభుత్వ బాధ్యతని ట్విట్టర్‌లో సీఎం జగన్‌ను ట్యాగ్ చేస్తూ కేశినేని నాని వ్యాఖ్యానించారు.