శ్రీకృష్ణ లీలారింఛోళి

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. స్నేహమందున స్వార్థమ్ము నిలచుచుండె
ధర్మమందున మర్మమ్ము దాగియుండె
నేదయా త్రికరణ శుద్ధి యెచట కాన
రాదె! గాలించి వెతికిన లేదు ఫలము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!
భావం: పరిమళాలు వెదజల్లబడాల్సిన నిష్కల్మషమైన నిరుపమానమైన, మధురాతి మధురమైన స్నేహంలో కూడా స్వార్థమే తొంగిచూస్తోంది.్ధర్మకార్యాల విషయంలో కూడా స్వార్థంతో కూడిన మర్మమే దాగి ఉంటోంది. త్రికరణ శుద్ధి అనేది ఎంత గాలించి చూసినా ఫలితం మాత్రం శూన్యం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవా! చూడవయ్యా ప్రభూ!
తే.గీ. వంటబట్టవు సత్కర్మలింటబైట ఁ
బరిమళించవు భావవంబులరయ చోద్య
మేల? య జన్మమెత్తితి వేల ? భరము
చూడుమో కర్మసాక్షి! యో సూర్యదేవ!

భావం: - ఇంటా బైటా సత్కర్మలంటేనే వంటబట్టకుండా పోతున్నాయి. భావపరిమళాలు దుర్గంధ భూయిష్టమై పోతున్నాయి. అటువంటప్పుడు ఈ మనుజ జన్మము ఎత్తడం దేనికి? మనిషివై పుట్టి ఈ భూమికి భారం రావడం దేనికి? మనిషై పుట్టి కూడా విచక్షణాజ్ఞానం అలవర్చుకోని జన్మ పశుజన్మనే అవుతుంది కాని పశుపతిని అర్చించే జన్మ కాదుకదా. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య ప్రభూ!

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262