తెలంగాణ

కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి తుది నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 25: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత కౌనె్సలింగ్‌కు కాళోజీ వైద్య, ఆరోగ్య విశ్వవిద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోట కింద సీట్ల భర్తీకి ఇప్పటికే మొదటి, రెండు, మూడో విడత వెబ్ కౌనె్సలింగ్ పూర్తి అయ్యిందని, కన్వీనర్ కోటలో ఇంకా మిగిలిపోయిన ఖాళీలను ఈ మాప్ అప్ రౌండ్ ద్వారా భర్తీ చేయనున్నారు. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్ సైట్‌లో పొందుపరిచినట్టు తెలిపారు. మొదటి ర్యాంక్ నుంచి చివరి ర్యాంక్ వరకు అభ్యర్థులందరూ ఈనెల 25వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 26 సాయంత్రం 5 గంటల వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసుకోవాలని అన్నారు. పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్లో పొందుపరిచినట్టు తెలిపారు.