ఆంధ్రప్రదేశ్‌

మొబైల్ యాప్‌లో కడప ఆకాశవాణికి చోటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, ఆగస్టు 23: ఎట్టకేలకు కడప ఆకాశవాణి కేంద్రానికి మొబైల్ యాప్‌లో స్థానం లభించింది. ఇటీవల మొబైల్ యాప్‌లో అనేక చిన్న ఆకాశవాణి కేంద్రాలకు కూడా చోటుకల్పించిన ప్రసార భారతి, అర్ధ శతాబ్దానికి పైగా చరిత్ర కలిగిన కడప ఆకాశవాణి కేంద్రాన్ని విస్మరించింది. దేశంలోని 92 ఆకాశవాణి కేంద్రాలను ఈయాప్ ద్వారా ప్రపంచంలోని ఏమూలనున్న వారైనా వినే అవకాశాన్ని ప్రసారభారతి కల్పించింది.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖ పట్టణం కేంద్రాల సాధారణ ప్రసారాలతోపాటు ఎఫ్‌ఎం కేంద్రాలకు కూడా యాప్ సౌకర్యం కల్పించి, తిరుపతి, అనంతపురం, కర్నూలు, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఆకాశవాణి కేంద్రాలకు ఈ సౌకర్యం కల్పించింది.
అయితే అదే సమయంలో కడప ఆకాశవాణిని మాత్రం పక్కనపెట్టారు. దీంతో సోషియల్ మీడియాలో రాయలసీమ రచయితలు స్పందించారు. దీనిపై ఇటీవల ఆంధ్రభూమి దినపత్రిలో సైతం వార్త వచ్చింది. కడప ఆకాశవాణి అధికారులు కూడా ఈవిషయమై కేంద్రప్రసార భారతి ఉన్నతాధికారులకు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ప్రసారభారతి కడప ఆకాశవాణి కేంద్రాన్ని మొబైల్ యాప్‌లో చేర్చింది.
ఇకపై యాప్ ద్వారా కడప కేంద్రం ప్రసారాలను రేడియో శ్రోతలు వినవచ్చు. జిల్లా నుండి అమెరికా, సింగపూర్, కువైట్, ఇతర గల్ఫ్‌దేశాలకు వలసవెళ్లిన అనేకమంది ఇక నుండి కడప ఆకాశవాణి ప్రసారాలు వినవచ్చు. గూగుల్ ప్లే స్టోర్‌లో ‘న్యూస్ ఆన్ ఎయిర్ ప్రసార్ భారతి లైన్ యాప్’అని ఇంగ్లీషులో సర్చ్‌చేసి ఈయాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యాప్ తెరవబడిన తర్వాత స్క్రీన్ పైభాగంలో రేడియో బొమ్మపై క్లిక్ చేయాలి, వెనువెంటనే అన్ని ఆకాశవాణి కేంద్రాల యాప్‌లు పనిచేస్తాయి. వాటిలో కోరుకున్న కేంద్రాలను అభిమాన కేంద్రాలుగా వరుసక్రమంలో అమర్చుకునే సౌకర్యం కూడా ఉంది.
స్థానిక ఎఫ్‌ఎం ప్రసారాలను వినేందుకు మొబైల్ ఫోన్‌కువినియోగిస్తున్న ఇయర్ ఫోన్ అవసరం కూడా, ఈయాప్ వినియోగానికి ఉండదు. ఈ యాప్ వల్ల మళ్లీ రేడియో అరచేతిలోకి వచ్చినట్లయ్యింది. ఆంగ్లం, హిందీ భాషలలో వార్తలను కూడా ప్రత్యేక కేంద్రం ద్వారా వినవచ్చు. దూరదర్శన్ ఛానళ్ల కార్యక్రమాలూ చూడవచ్చు.
మీసేవ కేంద్రాలను మూసివేయం
మంత్రి మేకపాటి స్పష్టం
అనుమసముద్రంపేట, ఆగస్టు 23 : రాష్టవ్య్రాప్తంగా ప్రజలకు ఎన్నో విధాలుగా సేవలు అందిస్తున్న మీ సేవ కేంద్రాలు ఎత్తివేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేదని రాష్ట్ర వాణిజ్య పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి మేకపాటి గౌతంరెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు డివిజన్‌లో పలు గ్రామాల్లో పర్యటించిన ఆయన దూబగుంట గ్రామంలో విలేఖరులతో మాట్లాడుతూ అవసరమైతే మీ సేవ కేంద్రాలను గ్రామ సచివాలయంలో విలీనం చేస్తామన్నారు. ఈవిషయంలో వదంతులు నమ్మవద్దని ఆయన ప్రజలకు హితవు పలికారు.