బిజినెస్

మాంద్యం గుప్పిట వాణిజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, ఆగస్టు 23: మళ్లీ ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాలను కమ్ముకుంటోందా? 2007-08 నాటి పరిస్థితులు పునరావృతం కాబోతున్నాయా? ప్రస్తుత అంతర్జాతీయ ఆర్థిక స్థితిగతులను లోతుగా పరిశీలిస్తే ఈ వాస్తవమే కళ్లకు కడుతోంది. అదుపుతప్పుతున్న ఆర్థిక వ్యవస్థను దారికి తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలేవీ అనుకున్న ఫలితాలు ఇచ్చే సూచనలు కనిపించడం లేదు. దాదాపుగా అన్ని దేశాల్లోనూ కర్మాగారాలు ఖాయిలాపడే పరిస్థితి తలెత్తుతోంది. అనేక వ్యాపార సంస్థలు చతికిలపడ్డాయి. ఇక ప్రపంచ వృద్ధి రేటు కూడా అత్యంత మందకొడిగా సాగుతోంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన రెండు ఆర్థిక వ్యవస్థల మధ్య మొదలైన వాణిజ్య యుద్ధం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఏడాది తిరగకుండానే ఇంతటి ప్రతికూల పరిస్థితి దాపురించడానికి గల కారణాలపై నిపుణులు తలలు పట్టుకుంటున్నారు. 2007-09 మధ్య ఏరకమైన ఆర్థిక విపత్తు తలెత్తిందో ఆదే పరిస్థితి ఇపుడు రాబోతోందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. పరిష్కారాలు కూడా ఏమాత్రం అందుబాటులోకి రావడంలేదు. అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను మరింతగా తగ్గించే పరిస్థితి చేయిదాటిపోయింది. ఇప్పటికే కనిష్ఠస్థాయిలో ఈ రేట్లు ఉన్నాయి. వాటిని కూడా తగ్గిస్తే, తదుపరి మాంద్య పరిస్థితులు తలెత్తితే ఎదుర్కొనే ఆర్థిక సత్తాను కూడా ఇవి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఇక ప్రభుత్వాల రుణభారం రాజకీయంగా పెను సమస్యలు సృష్టిస్తోంది. పన్నులు తగ్గించడానికి లేదా అభివృద్ధి పనులు చేపట్టడానికి వీల్లేని పరిస్థితులు అంతటా అలుముకున్నాయి. ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడానికి అందుబాటులో ఉన్న ఆయుధాలు పరిమితమేనని, గతంలో కంటే ఇవి మరింత తగ్గిపోయాయని హార్వార్డ్ యూనివర్సిటీకి చెందిన ఆర్థికవేత్త కరేన్ దినాన్ తెలిపారు. ఇప్పటికే ప్రపంచ వృద్ధి రేటు అంచనాలను ఇటు అంతర్జాతీయ ద్రవ్యనిధి, అటు ప్రపంచ బ్యాంకు గణనీయంగా తగ్గించాయి. అలాగే మూడీస్ ఇనె్వస్టర్స్ సర్వీస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఆర్థిక మాంద్య పరిస్థితి మరో రెండు, మూడు సంవత్సరాలపాటు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఈ క్రెడిట్ రేటింగ్ ఏజన్సీ హెచ్చరించింది. ఇటు ఏడు పారిశ్రామిక దేశాలు, మరోపక్క ప్రపంచ బ్యాంకర్లు ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడ్డాలన్న దానిపై దృష్టి పెట్టారు. సమావేశాల మీద సమావేశాలు జరుపుతున్నారు. పరిస్థితి ఇంతగా దిగజారడానికి ప్రధాన కారణం అమెరికా-చైనా మధ్య తలెత్తిన వాణిజ్యయుద్ధమేనని, ఇది రోజురోజుకూ శృతిమించుతోందని నిపుణులు అంటున్నారు. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా ఈ వాణిజ్య అనిశ్చితి ఇప్పటిలో తొలగిపోదన్నది మూడీస్‌కు చెందిన ఓ నిపుణుడి అంచనా. గత మూడేళ్లలో ఎన్నడూ లేనంతరీతిలో ప్రపంచ వాణిజ్య వృద్ధి రేటు అత్యంత తక్కువగా 2.5 శాతం మేర ఉండే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. వాణిజ్యంతోటే ముడిపడ్డ ఉత్పాదక సంస్థలు కూడా దిక్కులేని పరిస్థితిలో పడ్డాయి. ఐరోపా, జపాన్ ఆర్థిక వ్యవస్థలు కూడా మాంద్య ముంగళ్లకు చేరుకున్నాయి. ఇటు చైనా ఆర్థిక వ్యవస్థ కూడా 1990 నుంచి ఇప్పటివరకు ఎన్నడూ లేనంత రీతిలో అత్యంత తక్కువగా ఈ ఏడాది 6.2 శాతమే ఉండే అవకాశం ఉందని ఐఎంఎఫ్ అంచనా వేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే చైనాపై 250 బిలియన్ డాలర్ల సుంకాలను విధించారు. ఈ ఏడాది చివరికి మరో 300 డాలర్ల మేర సుంకాల మోత మోగిస్తామని చెబుతున్నారు. చైనా ఎదుర్కొంటున్న ఈ పరిస్థితి రాగిని ఉత్పత్తి చేసే చిలీ నుంచి ఇనుప ఖనిజం తయారు చేసే ఆస్ట్రేలియా వరకు ప్రకంపనలే సృష్టిస్తోంది. ఇవన్నీ కూడా చైనా ప్యాక్టరీలకు భారీ ఎత్తున ముడిపదార్థాలు అందించే దేశాలే. యూరో కరెన్సీని ఉపయోగించే 19 దేశాలు వరుసగా రెండో త్రైమాసికం కూడా వృద్ధి మాన్యంలో చిక్కుకున్నాయి. అమెరికా, చైనాతోనే సన్నిహిత సంబంధాలు కలిగిన యూరోజోన్ వాణిజ్య యుద్ధం కారణంగా చతికిలపడింది. ఐరోపా యూనియన్‌లో అత్యంత శక్తివంతమైన జర్మనీ కూడా వృద్ధి మాన్యంలో చిక్కుకుంది. ఇదే పరిస్థితి కొనసాగితే జర్మనీని ఆర్థిక మాంద్యం కమ్ముకునే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన కఠిన నిబంధనలు పాటించడానికి ఆటోమొబైల్ సంస్థలు టెక్నాలజీని అనుసరించాల్సి వస్తోంది. ఇందుకోసం బిలియన్లకొద్దీ డాలర్లను కుమ్మరించాల్సిన పరిస్థితి వాటికి ఎదురైంది. గత దశాబ్దంలో, అదీ తొలి త్రైమాసికం లో ఎన్నడూ లేని రీతిలో బీఎండబ్ల్యూ కూడా కార్ల వ్యాపారంలో నష్టపోయింది. మరోపక్క బ్రెగ్జిట్ కూడా ఐరోపా యూనియన్‌ను కలవరపెడుతోంది.