తెలంగాణ

వైద్య సేవల్లో మేం టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం పేద ప్రజలకు ఆరోగ్య శ్రీ కింద అందిస్తున్న వైద్య సేవలు దేశంలో మరెక్కడా అమలు కావడం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆయుష్మాన్ భారత్‌ను తెలంగాణ ప్రభుత్వం తీసుకోదని ఆయన తేల్చిచెప్పారు. ఈ స్కీం కేవలం 25 శాతం మందికి మాత్రమే ఉపయోగపడుతుందన్నారు. గురువారం ఆయన ఇక్కడ తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యవర్గసమావేశంలో మాట్లాడుతూ ఆరోగ్య శ్రీ ద్వారా 75 లక్షల కుటుంబాలకు వైద్యం అందుతోందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో ఎక్కడా కూడా రూపొందించలేదని ఆయన వెల్లడించారు. బీజేపీ నేతలు కేవలం ప్రచారం కోసం ఉత్తుత్తి కబుర్లు చెబుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. బీజేపీ మాటలను ప్రజలు నమ్మరని, ప్రతి రోజూ విమర్శించే వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. బీజేపీ,
ఇతర పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పిగొట్టాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. కాగా మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడువచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించారు. అన్ని మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ స్వీప్ చేస్తుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలను జనంలోకి తీసుకెళ్లాలని, ప్రజలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా వచ్చే రెండు సంవత్సరాల కోసం పార్టీ సభ్యత్వంలో భాగంగా ఇప్పటికే 60 లక్షల మందికి సభ్యత్వం ఇచ్చామన్నారు. అందులో 20 లక్షల మంది క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారని స్పష్టం చేశారు. 20 లక్షల మందికి గుర్తింపు కార్డులు ఇస్తామని తెలిపారు. గుర్తింపుకార్డులు వచ్చే నెల 15లోపు పంపిణీ చేస్తామని కేటీఆర్ వెల్లడించారు. ఈ నెల 25వ తేదీ లోపుసభ్యత్వ పుస్తకాలు పార్టీ కార్యాలయానికి చేరాలని ఆయన ఆదేశించారు. గ్రామ కమిటీ, మండల కమిటీలను ఈ నెల 31వ తేదీలోపల పూర్తి చేయాలని చెప్పారు. కమిటీల్లో ఎస్సీ, బీసీ, మైనారిటీల్లో 51 శాతం ఉండాలని ఆయన సూచించారు. అనుబంధ కమిటీలు, బస్తీ, వార్డు, బూత్ కమిటీలు నియమించనున్నట్లు చెప్పారు. 30 జిల్లాల్లో పార్టీ కార్యాలయాల నిర్మాణం పనులు ప్రారంభమయ్యాయని, దసరా నాటికి పూర్తి చేయాలన్నారు.
సభ్వత్వాల్లో గజ్వేల్ టాప్
సభ్యత్వానికి సంబంధించి కేటీఆర్ వివరాలను ఈ సమావేశంలో ప్రకటించారు. 90,575 మందితో గజ్వేల్ మొదటి స్థానంలో, 80,175 సభ్యత్వంతో మేడ్చెల్ రెండవస్థానంలో, 74,650 సభ్యత్వంతో మూడవ స్థానంలో కల్వకుర్తి, 72,262 సభ్యత్వంతో నాల్గవ స్థానంలో ములుగు, 67,850 సభ్యత్వంతో ఆరవ స్థానంలో సత్తుపల్లి, 69,175 సభ్యత్వంతో ఏడవస్థానంలో పాలేరు. 66,875 సభ్యత్వంతో ఎనిమిదవ స్థానంలో సూర్యాపేట, 64,575 సభ్యత్వంతో తొమ్మిదో స్థానంలో సిద్ధిపేట, 64,850 సభ్యత్వంతో పదవ స్థానంలో వర్థన్నపేట నిలిచినట్టు ఆయన చెప్పారు.

చిత్రం...తెలంగాణ భవన్‌లో పార్టీ కార్యవర్గసమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు