రాష్ట్రీయం

మందు ముట్టం.. అమ్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధన్వాడ: తమ గ్రామంలో ఇక నుంచి మద్యం సేవించడం కాని, అమ్మడం కాని చేయమని నారాయణపేట జిల్లా మద్వార్ గ్రామానికి చెందిన ప్రజలు ఏకగ్రీవంగా ప్రతిజ్ఞ చేశారు. తమ గ్రామం లో ఎవరైనా మద్యం అమ్మినా, తాగినా వారిపై రూ. 40వేల వరకు జరిమానా వేస్తామని గ్రామసర్పంచ్ రాజులయ్య ప్రకటిం చారు. ఆయన అధ్వర్యంలో గ్రామస్తులు తీర్మానం చేశారు. మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద గ్రామపెద్దల సమక్షంలో
సమావేశాన్ని నిర్వహించారు. మద్వార్‌లో ఎవరైనా మద్యాన్ని విక్రయించినా, తాగినా కఠిన చర్యలుంటాయని గ్రామసర్పంచ్, వార్డుసభ్యులు, గ్రామపెద్దలు గ్రామస్తులు తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని వచ్చే నెల 15నుంచి అమలు చేస్తున్నట్టు మంగళవారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సర్పంచ్ వెల్లడించారు. మద్యం తాగిన వారి నుండి వసూలు చేసిన డబ్బులను గ్రామాభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆయన తెలిపారు. సమావేశంలో గ్రామ ఉపసర్పంచ్ విష్ణువర్థన్‌రెడ్డి, వార్డుసభ్యులు, గ్రామపెద్దలు వెంకటన్న, భీమన్న, బాలయ్య, రాములు, రంజిత్‌కుమార్, ఆంజనేయులు, గ్రామ ఎంపీటీసీ అంజనేయులు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం...మద్వార్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న గ్రామ సర్పంచ్ రాజులయ్య